Thursday, December 12, 2024

తనయుడి కోసం మైండ్‌ బ్లోయింగ్‌ స్కెచ్‌

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎట్టకేలకు వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసింది. కొన్ని సంవత్సరాల నుంచి బాలయ్య అభిమానులు ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పరిచయం అవబోతున్నాడు. పురాణాలు, ఇతిహాసాల నుంచి స్ఫూర్తిగా తీసుకొని కథను తయారు చేసిన దర్శకుడు బాలయ్య తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకోబోతోంది. దీనితర్వాత మోక్షజ్ఞ రెండో సినిమాను కూడా బాలకృష్ణ సిద్ధం చేసి ఉంచారు. ఎంతోమంది కథానాయకులను పరిచయం చేసిన వైజయంతీ మూవీస్ బ్యానరుపై ఈ చిత్రం నిర్మించబోతున్నారు. దర్శకుడిగా నాగ్ అశ్విన్ అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాకు దర్శకుడు ఎవరో కాదు.. ఆయన అల్లుడు.. కల్కి డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్. ఈ కాంబినేషన్ ను ఇంతవరకు ఎవరూ ఊహించలేకపోయారు. నాగ్ అశ్విన్ మోక్షజ్ఞ కోసం ఎటువంటి కథ తయారుచేస్తాడా? అనే ఉత్కంఠలో అభిమానులున్నారు. దీంతో మొదటిసినిమాతోపాటు మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తీయబోయే సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, లెజెండ్ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్, మతుకుమల్లి తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular