నాగ చైతన్య, సాయి పల్లవి తో పాటు ఇతర కీలక నటీనటులు పాల్గొన్న ఇటీవలే ముగిసిన షెడ్యూల్ ఈ చిత్రానికి కీలకమైనది. ఇందులో చాలా ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు. నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తమ కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇందులో డి-గ్లామరస్ అవతార్‌లలో కనిపిస్తారు. దర్శకుడు చందూ మొండేటి పాత్రల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, ప్రాంతీయ యాస ప్రామాణికంగా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డిపార్ట్మెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం విజువల్ గా మ్యూజికల్ గా ప్రేక్షకులు మెస్మరైజింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ని అందించబోతోంది. మేకర్స్ త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.