పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు భారత్ గట్టిగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్‌తో అల్లాడిపోతున్న పాక్ ఏం చేయాలో తెలియక మన సైనిక స్థావరాలను టార్గెట్ చేసి పరాభవం మూటకట్టుకుంది. ఆపరేషన్ సిందూర్‌తో ఆగ్రహించిన పాకిస్తాన్ గురువారం భారత నగరాల్లోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ అది ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. జలంధర్, జమ్మూ, బటిండా, అవంతిపుర, శ్రీనగర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తల వంటి 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. కానీ దాని క్షిపణులు భారత శక్తి ముందు నిలబడలేకపోయాయి. తీవ్రంగా ధ్వంసమయ్యాయి. గురువారం రాత్రి, పాకిస్తాన్ ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలై, భుజ్‌తో సహా అనేక సైనిక లక్ష్యాలుగా చేసుకుంది. డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి దాడి చేయడానికి ప్రయత్నించింది” అని ప్రభుత్వం తెలిపింది. “ఈ దాడులతో వెలుగు చూసిన శిథిలాలు పాకిస్తాన్ దాడులను రుజువు చేస్తున్నాయని. వీటిని అనేక ప్రదేశాల నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు” అని ప్రభుత్వం తెలిపింది. భారత్‌లోని సైనిక స్థావరాలను టార్గెట్ చేసినందుకు రియాక్షన్ అంతే సీరియస్‌గా ఉంది. గురువారం భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాలలో ఉన్న వైమానిక రక్షణ రాడార్లు మరియు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని లాహోర్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థను విజయవంతంగా నాశనం చేసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. HQ9 యూనిట్లపై భారత్ దాడి చేసింది. దీంతో పాకిస్థాన్‌కు వందల కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిసింది.
HQ-9 వాయు రక్షణ వ్యవస్థ నాశనం పాకిస్తాన్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. దీని ప్రతిధ్వని బీజింగ్ నుంచి ఇస్లామాబాద్ వరకు వినిపిస్తోంది. సోర్స్ ప్రకారం, పాకిస్తాన్ సైన్యం HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ యూనిట్లు డ్రోన్ దాడుల్లో భారీ నష్టాలను చవిచూశాయి. లాహోర్, సియాల్‌కోట్, గుజ్రాన్‌వాలా, రావల్పిండి, చక్వాల్, బహవల్పూర్, మియాన్‌వాలి, కరాచీ, చోర్, మియానో, అటాక్‌లలో ఇటువంటి డ్రోన్ దాడులు జరిగాయి, దీనిలో అదింగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. “భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాల్లో వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్తాన్ మాదిరిగానే భారత రియాక్షన్ అంతకు మించి ఉంది. లాహోర్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థను నార్మలైజ్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది” అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
మరిన్ని దాడులకు సిద్ధంగా ఉన్నాం: రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన సాయుధ దళాలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. నేషనల్ క్వాలిటీ కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ, ఈ ఆపరేషన్ ఎంత కచ్చితత్వంతో నిర్వహించారో ఊహించలేనిది, ప్రశంసనీయం అని సింగ్ అన్నారు. ఈ దాడిలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారని రక్షణ మంత్రి అన్నారు. “ఈ ఆపరేషన్ ఏ అమాయకుడికి హాని కలిగించకుండా, చాలా భారీ నష్టం లేకుండా నిర్వహించారు…” అని సింగ్ అన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ బాధ్యతాయుతమైన దేశంగా పాత్ర పోషిస్తుందని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. ఎవరైనా సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే వారి ఊహించని ప్రతి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. “మన సహనాన్ని తప్పుగా వాడుకుంటే మాత్రం నిన్నటిలాంటి చర్య ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా అలాంటి ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నాము” అని రక్షణ మంత్రి అన్నారు.