Sunday, December 29, 2024

సీఎం చంద్రబాబు క్రైస్త‌వుల ప‌క్ష‌పాతి

టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాసు

విజ‌య‌వాడ : క్రైస్త‌వ స‌మాధుల స్థ‌లాల సేక‌ర‌ణ కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు ఉత్త‌ర్వుల జారీ చేయ‌టంపై టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాసు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాసు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈటె స్వామి దాసు మాట్లాడుతూ క్రిస్టియన్ అని చెప్పుకునే జగన్ రెడ్డి చేయక‌లేక‌పోయిన పని సీఎం చంద్రబాబు చేశాడన్నారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగిందని వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ఉత్తర్వులు ఇవ్వడం హ‌ర్ష‌ణీయ‌మ‌న్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడన్నారు.

అలాగే ఈ బడ్జెట్ స‌మావేశాల్లో లో క్రైస్త‌వుల సంక్షేమానికి 150 కోట్లు కేటాయించి సీఎం చంద్ర‌బాబు క్రైస్తవుల పక్షపాతి అని మ‌రోసారి నిరూపించుకున్నార‌న్నారు.అలాగే విదేశీ విద్య, సబ్సిడీ లోన్స్, జెరూసలేమి యాత్రకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాబోవు రోజుల్లో క్రైస్తవులకు మరిన్ని సంక్షేమ పథకాలు సీఎం చంద్ర‌బాబు అందిస్తార‌ని చెప్పారు. పాస్ట‌ర్ల‌ గౌరవ వేతనాన్ని కి కూడా నిధులు మంజూరు చేశాడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌ పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com