Wednesday, September 18, 2024

అమ్మవారి ఆలయంలో టిడిపి పందికొక్కులు చేరి 3 నెలల్లో 4 కోట్ల రూపాయలు అమ్మ సొమ్ము కొట్టేశారు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ: అమ్మవారి ఆలయంలో టిడిపి పందికొక్కులు చేరి 3 నెలల్లో 4 కోట్ల రూపాయలు అమ్మ సొమ్ము కొట్టేశారు. దీనికి ప్రధాన సూత్రదారి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న.

పార్కింగ్ కాంట్రాక్టర్ అమ్మవారి ఆలయానికి డబ్బులు చెల్లించకుండా 3 కోట్ల రూపాయలు మరియు కనకదుర్గ నగర్ లోని 24 షాపులు కు 40 శాతం అద్దె తగ్గించి ఎటువంటి టెండర్ పిలవకుండా 3 సంవత్సరాల పాటు 24 షాపులు కొనసాగించుకునేందుకు మరొక కోటి రూపాయలు వెరసి 4 కోట్ల రూపాయలు కొట్టేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అండ్ కో.

• అమ్మవారి ఆలయంలో అధికారులను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఇది మా టిడిపి జనసేన బిజెపి ప్రభుత్వం అని మేము చెప్పింది చేయాల్సిందేనని బుద్ధ వెంకన్న అమ్మవారి ఆలయంలోనే కాదు ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం వారికి కూడా హుకుం జారీ చేస్తున్నారు.

• అమ్మవారి మీద ఆధారపడి కాంట్రాక్టర్లు దుకాణదారులు బతుకుతున్నారా లేక దుకాణదారులు కాంట్రాక్టర్ల మీద ఆధారపడి అమ్మవారు ఉన్నారా?

A. అమ్మవారి ఆలయంలో పార్కింగ్ కాంట్రాక్టు పేరిట బుద్ధ వెంకన్న మరియు అతని బినామీలు మూడు కోట్ల ఆరు లక్షల రూపాయలు కొట్టేశారు. పార్కింగ్ కాంట్రాక్ట్ వ్యాపారం మాత్రమే సేవ కాదు.
1. అమ్మవారి ఆలయంలో పార్కింగ్ కాంట్రాక్ట్ పొందడానికి పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. పార్కింగ్ కాంట్రాక్ట్ ప్రస్తుత కాంట్రాక్టర్కు 2 సంవత్సరాల కాలపరిమితితో టెండర్ ఖరారు అయింది ఏడాదికి కాంట్రాక్టర్ అమ్మవారి ఆలయానికి చెల్లించాల్సింది 1.59 crs+ 18%GST అంటే రెండు సంవత్సరాల కాల పరిమితిలో మొదటి ఏడాదికి కాంట్రాక్టర్ ఆలయానికి చెల్లించాల్సినది 1.87 crs. మొదటి ఏడాది కాంట్రాక్టు పూర్తవడానికి ఒక నెల ముందే రెండో ఏడాది కాంట్రాక్ట్ ను కొనసాగించడానికి భక్తులు వద్ద నుండి పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి కాంట్రాక్ట్ర ర్ మొదటి సంవత్సరం ధరకు 10 శాతం పెంచి ఒక.నెల ముందుగానే చెల్లించాలి అంటే 1.59.crs+10% పెంపు 15.9 లక్షలు=1.75 crs దీనికి మరలా 18% GST చెల్లించాలి అంటే 30 లక్షలు వెలసి రెండవ ఏడాది పార్కింగ్ కాంట్రాక్టు పొందిన వ్యక్తి అమ్మవారి ఆలయానికి ఒక నెల ముందు చెల్లించాల్సినది అక్షరాల 2 కోట్ల 4 లక్షలు.

2. బుద్ధ వెంకన్న గారి సంపూర్ణ ఆశీస్సులతో అధికారుల అండదండలతో పార్కింగ్ కాంట్రాక్టర్ బుద్ధ వెంకన్న బినామీ రెండవ ఏడాది చెల్లించాల్సిన 2 కోట్ల 4 లక్షల రూపాయలను అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా మొదటి యాడాది పార్కింగ్ కాంట్రాక్టు వల్ల సరైన ఆదాయం రాలేదని ఒక కారణం చూపించి ఆరు నెలల పాటు ఉచితంగా అమ్మవారి భక్తుల వద్ద నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని ఈవో గారు ఎండోమెంట్ కమిషనర్ గారికి సిఫార్సు చేశారు.
3. ఎక్కడైనా భక్తులకి ఉచితంగా పార్కింగ్ చేసుకోమని అవకాశం సౌకర్యం ఆలయాలు కల్పిస్తూ ఉంటాయి కానీ అందుకు భిన్నంగా అమ్మవారి ఆలయంలో పార్కింగ్ కాంట్రాక్టర్ బుద్ధ వెంకన్న గారి బినామీ అయినందున 6 నెలల పాటు ఉచితంగా అంటే 1 కోటి 2 లక్షలు భక్తుల వద్ద నుంచి పార్కింగ్ పేరిట దోచుకోమని అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తున్నారు.

4. రెండవ ఏడాది కాంట్రాక్టర్ చెల్లించాల్సిన 2 కోట్ల 4 లక్షలు చెల్లించకుండా 6 నెలల పాటు అమ్మవారి ఆలయానికి రూపాయి చెల్లించకుండా భక్తుల వద్ద నుంచి పార్కింగ్ ఫీజు వసూలు పేరిట మరొక 1 కోటి 2 లక్షల రూపాయలు వసూలు చేసుకోమని అంటే మొత్తం 3 కోట్ల 6 లక్షల రూపాయలను సదరు కాంట్రాక్టర్ అంటే బుద్దా వెంకన్న బినామీ కొట్టేశారు.
5. ఉచితంగా పార్కింగ్ కాంట్రాక్ట్ అంటే భక్తుల దగ్గర నుంచి యదేచ్చగా డబ్బులు దోచుకోమని అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తున్న అమ్మవారి ఆలయంలోని ప్రధాన అధికారులు అందుకు సహకరిస్తున్న ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం?

6. టెండర్ ఖరారు చేసే సమయంలో నిబంధన 13 బాగా చదువుకోవచ్చు లైసెన్స్ కాలంలో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంబంధించిన ఎటువంటి రాయితీలు లీజు పొడిగింపులు ఇవ్వబడవని చాలా స్పష్టంగా నిబంధన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈవో గారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ ఇది మా టిడిపి కూటమి ప్రభుత్వమని మేము చెప్పింది చేయాల్సిందేనని బుద్ధ వెంకన్న హుకుం జారీ చేస్తున్నారు.
7. బుద్ధ వెంకన్న బినామీ అమ్మవారి ఆలయంలో పార్కింగ్ కాంట్రాక్ట్ పేరిట మూడు కోట్ల ఆరు లక్షల రూపాయలు కొట్టేస్తున్న మాట నిజం. ఇది స్కాం కదా దీనిపై చర్చకు నేను ఎక్కడికైనా సిద్ధమే బహిరంగంగా సవాల్ విసురుతున్న. ఏ ఛానల్ లో అయినా డిబేట్ కి మేము సిద్ధం.
B. కనకదుర్గ నగర్ లోని 24 షాపుల అద్దెను 40% తగ్గించి ఎటువంటి పోటీ లేకుండా ఎటువంటి టెండర్ పిలవకుండా తిరిగి ఈ 24 షాపు యజమానులకే మరొక 3 సంవత్సరాలు లీజు పొడిగించాలని అమ్మవారి ఆలయ అధికారులు ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయానికి సిఫార్సు చేసినారు.
కనకదుర్గ నగర్ లో 24 షాపులు అంశంలో ఒక కోటి రూపాయలు దోపిడీ చేశారు.

ఇది కూడా బుద్ధ వెంకన్న గారి మహిమ.ఇవేమీ నా సొంత రాతలు కాదు ఈవో గారు 40% అద్దెలు తగ్గించాలని ఆమోదం కోరుతూ ఎండోమెంట్ కమిషనర్ గారికి లేఖ రాశారు.దేవాలయాల్లోని షాపులకు ఏడాదికి 33.3% అద్దెలు పెంచుతారు కానీ అమ్మవారి ఆలయం ప్రత్యేకం అద్దెలు 40% తగ్గించమని ఉత్తర్వులు జారీ చేయమని పై అధికారులకు సిఫార్సు లేఖలు రాస్తారు.
మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే దోచుకో దాచుకో తినుకో అమలు చేస్తారని నేడు వారు చెప్పింది నిజం అయ్యింది.
షాపులకు.అద్దెలు 40% తగ్గించి కాలపరిమితి ఎటువంటి పోటీ లేకుండా 3 సంవత్సరాలు పెంచినందుకు గాను ఒక్కొక్క షాపు లీజు దారుడు వెంకన్న గారికి 5 లక్షల రూపాయలు చెల్లించారని వినికిడి అంటే మొత్తం 24 షాపులకు గాను ఒక్కొక్క షాపుకు 5 లక్షల రూపాయలు చొప్పున ఒక కోటి 20 లక్షలు. కోటి రూపాయలు వెంకన్న గారికి 20 లక్షలు మరి ఏ అధికారికి ఇచ్చారు.

1. నష్టాలు వస్తే భక్తులు రాకపోవడానికి ఇదేమన్నా కరోనా కాలమా లేక బుడమేరు ముంపు సమయమా ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం పండుగలు నాడు లక్షలాదిమంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి పేపర్లో చదువుతున్నాం అయినా భక్తులు రావడంలేదని సరిగ్గా వ్యాపారం జరగక నష్టాలు వస్తున్నాయని దుకాణదారులు చెబుతున్నారని అధికారులు సిఫార్సు లేఖలు రాస్తున్నారంటే ఇది కేవలం డబ్బులు కొట్టేసే కుట్రే.
2. కనకదుర్గ నగర్ లో క్యూ లైన్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఈ షాపులు తీసి మీరేమి 5 అంతస్తులను ఆరో అంతస్తులును ఇవ్వడం లేదు మరల కనకదుర్గ నగర్ లోనే ఇస్తున్నారు మీరు ఇచ్చే ప్రాంతం అధికంగా భక్తులు రద్దీ ఉండే ప్రాంతం.
3. 24 షాపుల వారికి నెలకి 90000 అద్దె+18%GST=106200
4. గత రెండు సంవత్సరాలుగా నెలకు 1,6,000 అద్దె చెల్లించిన వారికి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇదేమన్నా కరోనా కాలమా లేక బుడమేవరు వరద సమయమా భక్తులు రాకపోవడానికి వ్యాపారాలు జరగకపోవడానికి.

5. కనకదుర్గ నగర్ లోని రోడ్డుకు కుడివైపు ఉన్న షాపులను ఎడమే వేకుపూకు మార్చారు అందుకోసం ఏడాదికి కోటి రూపాయలకు పైగా అద్దెలు తగ్గించి మూడు సంవత్సరాల కాలం ఎటువంటి టెండర్లు పిలవకుండా అదే షాపులను కొనసాగించాలా ఇది ముమ్మాటికీ స్కామే.
C. ఘాట్ రోడ్ కాంట్రాక్టును దేవాదాయ శాఖ మంత్రి గారికి బంధువు అయినందున ఎటువంటి టెండర్ పిలవకుండా ఎమర్జెన్సీ పని కింద నామినేషన్ పద్ధతిన ఒక కోటి 35 లక్షల రూపాయలు విలువగల టెండర్ను కట్టబెట్టారు. సదర్ కాంట్రాక్టర్ కు అర్హత ఉందా అనుభవం ఉందా కొండ రాళ్లు జారి పడుతున్న ప్రాంతంలో పనిచేయగలరా లేదా అని విచారణ చేశారా లేదా వారికున్నటువంటి సమర్ధత ఏంటి అని ఎండోమెంట్ కమిషనర్ గారు నిర్ధారించుకొని సదర్ టెండర్ను కట్టబెడితే బాగుండేదని మా అభిప్రాయం.
D. అన్నదానం స్టీల్ టేబుల్స్ టెండర్ ను 36 లక్షల రూపాయలకు ఖరారు చేశారు ఈ టెండర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఏదో ఒక సాకు చూపించి డిస్క్వాలిఫై చేసినారు. ఈ అన్నదానం స్టీల్ టేబుల్స్ కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి కూడా బుద్ధ వెంకన్న బినామీనే ప్రస్తుతం ఇతను ఈ స్టీల్ టేబుల్స్ తయారీని సివిరెడ్డి చారిటీస్ అమ్మవారి ఆలయం కింద ఉన్న ఖాళీ స్థలంలోనే పనులు చేస్తున్నారు కరెంట్ బిల్లు ఎవరిదని మాత్రం అడక్కండి కాంట్రాక్టర్ ది మాత్రం కాదు అమ్మవారి ఆలయందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular