-
94 మందితో మొదటి జాబితా
-
తాజాగా 34 మందితో రెండో జాబితా
-
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
27 మంది పురుషులు, 7గురు మహిళలు
టీఎస్ న్యూస్: తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 34మంది అభ్యర్థుల లిస్టును గురువారం ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 94మందితో మొదటి జాబితా గతంలో ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజా జాబితాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమండ్రి రూరల్), పల్లా శ్రీనివాసరావు (గాజువాక), ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు), చింతమనేని ప్రభాకర్ (దెందులూరు), బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి (శ్రీకాళహస్తి) టికెట్ దక్కించుకున్నారు.
శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఏపీలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెస్తున్నాయి. ఇప్పటికే 94 మందితో తొలి జాబితాను విడుదల చేయగా.. తాజాగా 34 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. వీరిలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. ఈ లిస్ట్‌లో పీహెచ్‌డీ చేసిన ఒకరికి చోటు దక్కింది. ఇక 11 మంది పీజీ చేసిన వారు ఉన్నారు. గ్రాడ్యుయేషన్ చేసిన వారు 9 మంది, ఇంటర్ చదివిన వారు 8 మంది, టెన్త్ పూర్తిచేసిన వారు ఐదుగురికి టికెట్లు దక్కాయి.