Sunday, April 20, 2025

తెలంగాణలోను టీడీపీ అధికారంలోకి.. నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన Chandrababu Naidu టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించారా? అంటే అవుననే సమాధానం వస్తోది. ఏపీలో సాధించిన విజయస్పూర్తితో తెలంగాణలోను అధికారంలోకి వస్తామన్న నారా భువనేశ్వరి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సాధించిన అఖండ విజయాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ఆమె ధీమా వ్యక్తం చేయడం ఆసక్తిరంగా మారింది.

ఏపీలో విజయం తరువాత హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన భువనేశ్వరి నేతలు, కార్యకర్తలను కలిశారు. ఈ సందర్బంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆమె చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో వచ్చినట్టుగానే తెలంగాణలోనూ టీడీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతుందంటూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు నారా భువనేశ్వరి. ఐతే అందుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, త్వరలోనే అధినేత చంద్రబాబు హైదరాబాద్ వచ్చి నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారని చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com