Wednesday, November 20, 2024

దివికేగిన మానవత వాది రతన్ టాటా కు అశ్రు నివాళి..

దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబయి బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతూ రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు.

రతన్ టాటా మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వ్యాపార రంగంలో సాధించిన విజయాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ దేశం లోని రాజకీయ, సినీ రంగ ప్రముఖులు, వ్యాపార వేత్తలు ఘనంగా నివాళులర్పించారు.

దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త రతన్ టాటా: ప్రధాని నరేంద్ర మోదీ..

దార్శనికులైన వ్యాపార దిగ్గజం, అసాధారణ మానవతా వాది అయిన రతన్ టాటా మనకు దూరం అయ్యారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారీ లక్ష్యాలను ఊహించడం, ఆ ప్రతిఫలాలను సమాజానికి తిరిగి ఇవ్వడం రతన్ టాటా నైజం. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ద్యం, జంతు సంరక్షణ సేవల్లోనూ రతన్ టాటా ఎంతో ముందుడే వారని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

 

దేశం లోనే ఘన చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్ నకు ఆయన ఎంతో స్థిరమైన నాయకత్వాన్ని అందించారని, బోర్డు రూం కార్య కలాపాలకు మించి దేశానికి అమూల్య సేవలందించారని ప్రధాని మోదీ అన్నారు.

 

భారత్ గొప్ప దిగ్గజాన్ని కోల్పోయింది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

రతన్ టాటా మరణంతో భారత దేశం ఓ గొప్ప దిగ్గజాన్ని కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దాతృత్వం, సేవా కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం నిరుపమానం అన్నారు.

దేశ ముద్దు బిడ్డను కోల్పోయాం: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ..

రతన్ టాటా మృతికి కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపారం, దాతృత్వంలో చెరగని గుర్తులను రతన్ టాటా మిగిల్చి వెళ్లిపోయారని పేర్కొన్నారు. రతన్ టాటా కుటుంబానికి, టాటా గ్రూప్ నకు సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు.

నిజమైన మానవతావాదిని కోల్పోయాం: ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు..

దార్శనికత, చిత్తశుద్ధితో ఈ ప్రపంచంపై చిరస్థాయిగా ముద్ర వేసిన తక్కువ మంది వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కేవలం ఒక వ్యాపార దిగ్గజాన్నే కాదు.. నిజమైన మానవతావాదిని కోల్పోయాం. సామాజాన్ని మెరుగు పరిచేందుకు రతన్ టాటా నిరంతరం ప్రయత్నించారని, మానవీయత మూర్తీభవించిన అసాధారణ మనిషి ఆయన అని నారా చంద్రబాబు అన్నారు.

 

ప్రపంచంలో తమదైన ముద్రం వేశారు: తెలంగాణ సీఎం ఏ. రేవంత్ రెడ్డి..

వ్యాపార రంగంలో రతన్ టాటా పాటించిన విలువలు, సామాజిక సంక్షేమం కోసం ఆయన పడిన తపన స్ఫూర్తిదాయకం. సేవకు ఆయన ప్రతిరూపం అని తెలంగాణ సీఎం ఏ. రేవంత్ రెడ్డి అన్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular