శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు గురువారం ఆందోళనకు దిగారు. హైదరాబాద్- టు చెన్నై విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 7.15 గంటలకు హైదరాబాద్ నుంచి చెన్నై బయల్దేరాల్సిన విమానం గంటల తరబడి కదలకపోడంతో ప్రయాణికులు ఆగ్రహనికి గురయ్యారు.
విమానం ఆలస్యంపై ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమాన ఆలస్యానికి కారణం చెప్పకుండా అధికారులు దాట వేస్తున్నారని అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.