అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ ముగిసింది. అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వొదంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ ఇవ్వాలంటూ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 4న పుష్ప బెనిఫిట్ షో రోజు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, ఈ నెల 27న రిమాండ్ ముగిసింది. అదే రోజు ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అప్పుడే ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ వాయిదా పడగా, సోమవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. తీర్పును వచ్చేనెల 3కు వాయిదా వేసింది.