న్యూ ఇయర్ వేడుకల్లో ఏరులై పారిన మద్యం
కొత్త సంవత్సరం వేళ రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. అన్ని వర్గాల ప్రజలు న్యూ ఇయర్‌ను మద్యం మత్తులో ఘనస్వాగతం పలికారు. డిసెంబర్ 31 నుంచి పోలీసులు ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతున్నా మందుబాబులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తాగి తెగతూలారు. వేడుకల పేరుతో మద్యం మత్తులో మునిగి తేలారు. ఫలితంగా మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో రూ.520 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. డిసెంబర్ 30న రూ.402 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గడిచిన నాలుగు రోజుల్లో సుమారు రూ.1800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. దాంతో కొత్త సంవత్సరం వేళ ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. హైదరాబాద్, ముఖ్య పట్టణాలతో పాటు ప్రతి పల్లెలో జోరుగా మద్యం విక్రయాలు జరిగాయి. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ అదేసమయంలో 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దెత్తున సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సెలెబ్రేషన్స్ లో మందుబాబులు మద్యం మత్తులో మునిగితేలారు. డిసెంబర్ నెల మొత్తం సుమారు రూ. 3,800కోట్ల పైచిలుకు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. మరీముఖ్యంగా 30, 31 తేదీల్లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ నెలలో మొత్తంలో 38లక్షల కేసుల లిక్కర్ సేల్స్ అయితే, 45లక్షల బీర్ కేసుల సేల్స్ అయినట్లు ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ రూ.150 నుంచి రూ. 200 కోట్లు లిక్కర్ సేల్స్ ఉంటాయి. అయితే, డిసెంబర్ నెలలో మాత్రం అది పూర్తిస్థాయిలో దాటిపోయిన పరిస్థితి. మొత్తానికి న్యూఇయర్ వేడుకల వేళ మందుబాబులు ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండించారు.
నగరవ్యాప్తంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.
న్యూ ఇయర్ వేడుకల వేళ తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు హెచ్చరించినా మందుబాబులు వినిపించుకోలేదు. నగర ప్రజలు ఎంతో ఉత్సాహంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో డీజేలు, డ్యాన్స్‌లు, విందులతో సందడి చేశారు. వారిలో కొందరు మత్తులో మునిగితేలారు.తాగి రోడ్ల పై రభస చేశారు. ఇంకొందరు మద్యం మత్తులో వాహనాలు నడిపి పోలీసులకు చిక్కారు. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్లపై మందుబాబులు పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా మొత్తం 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కేసుల సమయంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసులతో మందుబాబులు వాగ్వాదానికి దిగిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. జోన్‌ల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే .. ఈస్ట్ జోన్ లో 236, సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179, సౌత్ వెస్ట్ జోన్ లో 179, నార్త్ జోన్ లో 177, సెంట్రల్ జోన్ లో 102 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వెంగళరావు పార్క్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి తనిఖీలలో భాగంగా అతడి బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో 550 పాయింట్లు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక పోలీసుల కఠిన తనిఖీలను చూసిన కొందరు, కొన్ని చోట్ల మందుబాబులు బైక్‌లను వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ, పోలీసులు వారిని పట్టుకుని సరైన చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని వెంగళరావు పార్క్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. పోలీసుల టెస్టులో భాగంగా అతడికి 550 పాయింట్లు వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. వాస్తవానికి 35 పాయింట్ మరోవైపు.. రోడ్ల మీద పోలీసుల తనిఖీలను చూసిన మందుబాబులు బైక్‌లను వదిలేసి పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.