Thursday, January 2, 2025

తెలంగాణ యాస – తెర‌పై సూప‌ర్ హిట్టే!

తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక సంస్కృతి, నేపథ్యం ఉన్నాయి.. ఇక్కడ యాస, భాషలకు ఎంతో ప్రత్యేకత ఉంది. హిందీ, ఉర్దూ, అరబిక్​ కలగలసిన తెలుగు ఇక్కడి ప్రత్యేకత. ప్రతి విషయాన్ని సొంతం చేసుకుని పలకరించే తెలంగాణ యాస, వేషధారణ, అందరినీ బంధువులను చేసుకుని అన్న, అక్క అంటూ ఆత్మీయ పలకరింపు తెలంగాణకే సొంతం. ఒకప్పుడు తెలుగు సినిమాలో తెలంగాణ మాండలికాన్ని వెకిలి పాత్రలకు పరిమితం చేశారు. పనిగట్టుకొని మరీ హాస్యనటుల ద్వారా అపహాస్యంగా వినిపించారు. కత్తిగట్టి విలన్ల నోటివెంట పట్టుబట్టి తెలంగాణ యాసను మట్టుపెట్టారు. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్‌ మార్చింది. ఇప్పుడు మాత్రం తెలంగాణ యాస అంద‌రికీ ఇష్టంగా మారింది. తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస‌తో వ‌చ్చిన సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొడుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు తెలంగాణ భాష, యాస, సంస్కృతికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. ఇక గత కొంత కాలంగా టాలీవుడ్​లో తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఘన విజయం కూడా సాధిస్తున్నాయి.

దసరా..

న్యాచురల్‌ స్టార్‌ నాని, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో ఈ నెల 30న విడుదలైన చిత్రం దసరా. ఈ సినిమా కథ పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని (తెలంగాణ)లోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఇప్పటికే విడుదల చిత్రం ప్రేక్షకుల మన్నన అందుకుంది. అన్ని చోట్ల నుంచి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో శ్రీకాంత్​ ఓదెల దర్శకుడిగా పరిచయం అవ్వగా.. అతనితోపాటు, నాని కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా దసరా నిలిచిందని చెప్పవచ్చు.

బలగం..

జబర్ధస్త్​ షోతో కమెడియన్​గా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తీసిన చిత్రం బలగం. తెలంగాణ లోని విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన బలగం చిత్రం కుటుంబ విలువలను కలిగి ఉన్న సినిమాగా అందరినీ బాగా ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్​ రామ్​ హీరోహీరోయిన్లుగా ఒదిగిపోయారు. దిల్​రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్​గానూ మంచి విజయం దక్కించుకుంది.

రుద్రమదేవి..

కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటించిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ ‘ది వారియర్‌ క్వీన్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైంది. ఈ సినిమాలో కాకతీయ సామ్రాజ్యం, తెలంగాణలోని నేటి వరంగల్​ ఒకప్పటి ఓరుగల్లు రాజధానిగా రుద్రమదేవి పాలన గురించి వివరించారు.

ఫిదా..

వరుణ్ తేజ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫిదా మూవీ లో కూడా తెలంగాణ సంప్రదాయాల గురించి చూపించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం బ్లాక్‌ – బస్టర్ ఫలితాలతో తడిసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. అయితే ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటినా ఈ పాట మాత్రం, ఇంకా జనాల మదిలోనే కాక నాలుకలపై కూడా నర్తిస్తుంది. అప్పుడప్పుడు వార్తల్లోకి ప్రవహిస్తూనే ఉంది. “వచ్చిండే.. మెల్లా మెల్లగా వచ్చిండే..” అంటూ సింగర్ మధుప్రియ పాడిన అశోక్ తేజ గీతానికి స్పింగులు మింగినట్లు సాయిపల్లవి తన నృత్యంతో నర్తించి అందరినీ ఫిదా చేసిన ఈ పాట ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీ లో టాప్ రికార్డును సొంతం చేసుకుంది.

ఇవే కాకుండా చాలా సినిమాలు తెలంగాణ నేపథ్యంలో రూపొంది ప్రేక్షకులను మెప్పించాయి. డీజే టిల్లు సినిమాలో హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా తెలంగాణ యాసతో డైలాగ్స్​ చెప్పి నవ్వులు పూయించారు. ఈ సినిమా సీక్వెట్ టిల్లు స్వేర్‌లో కూడా తెలంగాణ మాట‌లే యూత్‌ను తెగ ఆక‌ట్టుకున్నాయి. నవీన్ పోలిశెట్టి హీరో గా వచ్చిన జాతి రత్నాలు, రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని కొమురం భీం పాత్రలు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారివే.. నాగార్జున గతంలో రాజన్న సినిమాను కూడా తెలంగాణ నేపథ్యంలో తీసి… ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా నటులు కూడా తెలంగాణ యాస, భాషలను ఎంతో ఇష్టంతో నేర్చుకుని మాట్లాడటంతో అభిమానులను ఆ చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపోందిన భగవంత్ కేసరి చిత్రంలో తెలంగాణ యాస కు మరింత వన్నె తెచ్చింది.. ఆసినిమాలో బాలకృష్ణ వర్సెన్ అంతా తెలంగాణ మాండలికంలోనే ఉంది. ఆనంద్ దేవరకొండ కూడా దొరసాని చిత్రం తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో తెలంగాణ యాసతో అన్న విజయ్ దేవరకొండ కు తగ్గ తమ్ముడిగా పేరు తెచ్చుకున్నాడు. బేబి చిత్రంలో కూడా యాసతో అలరించాడు. అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య కూడా తెలంగాణ మాండలికంలో మెప్పించింది.

ఇవి కాకుండా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నర్సపల్లే తెలంగాణ పాటను , రవితేజ ప్రస్తుతం నటిస్తున్న ప్రతి సినిమాలోను తెలంగాణ పాటలను సినిమాలో పెట్టుకున్నారు… ఆ పాటలు కూడా అంతే ఆదరణ ను పోందుతున్నాయి. ఇంటింటి రామాయాణం, భీమదేవరపల్లి బ్రాంచ్, మేమ్ ఫేమస్, రుద్రంగి, ఓదేల్ రైల్వే స్టేషన్, రజాకార్, పోలిమేర, పోలిమేర 2 చిత్రాలే కాకుండా నూతన నటీనటులు నటించిన ఎన్నో సినిమాలు ఓటీటీలో, యూట్యూబ్ లో తెలంగాణ యాసతో రూపొందిన చిత్రాలు దర్శనమిస్తాయి. ఎంతో అల‌రిస్తాయి.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com