Sunday, November 17, 2024

‘టాస్’ను ఏర్పాటు చేయండి

ప్రభుత్వానికి తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి

తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టాస్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. కేరళ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలోనే తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హనుమంతు నాయక్‌లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశంలో చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కొన్ని కార్పొరేషన్ ఎండిలుగా గ్రూప్-1 అధికారులను నియమించారని వారికి తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. 2015లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై అధ్యయనానికి ఆరుగురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీ వేసిందని, ఇప్పటికీ ఐఏఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించలేదని ఆయన అన్నారు .

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరత దృష్ట్యా ప్రతిభావంతులైన గ్రూప్ 1 అధికారులను కార్పొరేషన్ ఎండిలుగా, స్థానిక సంస్థల్లో అనుభవం ఉన్న గ్రూప్ 1 అధికారులను స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్లుగా నియమించాలని చంద్రశేఖర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. త్వరలోనే ముఖ్యమంత్రిని, చిన్నారెడ్డి కమిటీని, ప్రభుత్వప్రధాన కార్యదర్శి ని కలిసి తమ సమస్యలను విన్నవిస్తామని చంద్రశేఖర్ తెలిపారు ఈ సమావేశంలో వివిధ శాఖల గ్రూప్ 1 అధికారులు వేణుమాధవ్ రెడ్డి, సయ్యద్ యాసీన్ ఖురేషి, అలోక్ కుమార్, అంజన్ రావు అజయ్, భవాని, శశి శ్రీ, పద్మజారాణి పద్మావతి, వినయ్, సోమశేఖర్, నూతనకంటి వెంకట్ , శరత్ చంద్ర, శ్రీరామ్, వినోద్ రెడ్డి, షబానా,మైత్రి ప్రియ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular