Friday, May 23, 2025

గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా తెలంగాణ

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

దేశ ప్రగతిలో ఐఐటీలది కీలక పాత్రగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఐఐటీ హైదరాబాద్‌ కేవలం విద్యాసంస్థ మాత్రమే కాదని, ఆవిష్కరణలకు కేంద్రబిందువు అని కొనియాడారు. ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్‌ మినరల్‌ రీసెర్చ్‌ హబ్‌ వర్క్‌షాప్‌ను శుక్రవారం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ తెలంగాణను గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా మారుస్తామని చెప్పారు.

2030 నాటికి 2వేల మెగావాట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఫ్లోటింగ్‌ సోలార్‌పై పెట్టుబడులు పెడతామని వెల్లడించారు. ఖనిజ ఉత్పత్తుల కోసం ఐఐటీతో సింగరేణి ఒప్పందం సంతోషకరమైన విషయమని చెప్పారు. గ్రీన్ పవర్ రంగం లో ప్రస్తుతం తెలంగాణ శక్తి సామర్థ్యం 11,399 మెగావాట్లుగా ఉందని, ఇందులో 7,889 మెగావాట్ల సౌరశక్తి పంపిణీ జరిగిందని, ఇందులో 770 మెగావాట్లు గ్రీన్ పవర్ ఉందని భట్టి చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com