క్రీడాకారులకు బెస్ట్ విషెస్ చెప్పిన సిఎం రేవంత్
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ క్రీడాకారులు పథకాల సాధనకు సిద్ధమయ్యారు. స్టార్ అథ్లెట్స్ కొంతమంది తమ తొలి రౌండ్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ క్రీడాకారులకు సిఎం రేవంత్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయా కేటగిరీల తొలి దశల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోన్న తెలంగాణ అథ్లెట్స్ నిఖత్ జరీన్ (బాక్సింగ్), శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), పివి సింధు (బ్యాడ్మింటన్)లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అలాగే తన ఈవెంట్ కోసం సిద్ధమవుతోన్న ఇషా సింగ్ (షూటింగ్)కు కూడా సిఎం బెస్ట్ విషెస్ చెప్పారు. వీరంతా తర్వాత దశల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి విజయంతో దేశానికి మెడల్స్ సాధించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.