Wednesday, September 18, 2024

సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు

సీఎం రేవంత్‌కి నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఈ క్రమంలో సీఎంకు కోర్టు నోటీసులు ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో సభలో బీజేపీపై విమర్శలు చేశారు రేవంత్‌రెడ్డి. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని రేవంత్‌ వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేశారు. కింది కోర్టు పలుమార్లు కేసును వాయిదా వేయడంతో హైకోర్టుకు వెళ్లారు కాసం. హైకోర్టు ఆదేశాలతో రేవంత్ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది.

సీఎం రేవంత్ చెప్పింది ఏంటి?
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారని అన్నారు. 100 ఏళ్లలో భారత్ ను హిందూ రాజ్యాంగ మార్చాలని 1925లో RSS ప్రతిజ్ఞ చేసిందని పేర్కొన్నారు. ఆ కుట్రలో భాగంగానే 2025లో భారత దేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చబోతున్నారని అన్నారు. అందుకే 2/3 మెజారిటీ కావాలని బీజేపీ నేతలు అడుగుతున్నారని అన్నారు. బీసీలు, ఓబీసీలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని.. రిజర్వేషన్లను రద్దు చేయమని బీజేపీ ఎందుకు చెప్పడం లేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఈ కుట్రను తిప్పి కొట్టేందుకే కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ కూడా అదే మాట..
గతంలో కేసీఆర్ సీఎం పదవిలో ఉన్నప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చలని ఆయన అన్నారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే బీజేపీ విధానంలో భాగంగానే ఆ మాట అన్నారా? అని నిలదీశారు. రిజర్వేషన్లపై కేసీఆర్ విధానాన్ని ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ విధానం ఏంటో కేసీఆర్ స్పష్టం చేయాలని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 5 పార్లమెంట్ స్థానాలను కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఈటలకు వ్యతిరేకంగా కేసీఆర్ ఎక్కడా మాట్లాడలేదని పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular