Sunday, September 29, 2024

రైతు రుణ మాఫీకి కేబినెట్ ఆమోదం సీఎం రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ లో హామీలపై కేబినెట్ లో చర్చించినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ పంట రుణాల మాపీపై హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని అమలు చేస్తూ తెలంగాణలోని రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ లో హామీలపై కేబినెట్ లో చర్చించినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ పంట రుణాల మాపీపై హామీ ఇచ్చారన్నారు. ఆ హామీను అమలు చేస్తూ తెలంగాణలోని రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు రైతులు తీసుకున్న రుణాలను ఒక్కో రైతుకు రూ.2 లక్షల వరకు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ రుణాలను మాఫీ చేయడానికి రూ.31 వేల కోట్లు అవసరం పడుతుందన్నారు. ఈ రుణాలను మాఫీ చేసి రైతు సంక్షేమ రాజ్యంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్తామన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ హామీని నిలబెట్టుకోకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఇచ్చిన హామీ మేరకు 8 నెలల్లోనే రుణమాఫీ చేయనున్నామన్నారు. రైతు భరోసా విధివిధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ వేస్తున్నామన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు. వీరు అందరితో చర్చించి జులై 14న నివేదిక ఇస్తారన్నారు. ఈ నివేదికను అసెంబ్లీలో చర్చించి నియమ నిబంధనలను ఖరారు చేస్తామన్నారు.
ప్రభుత్వం నిర్ణయాలను మీడియాకు వివరించడానికి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిని మంత్రి వర్గం నుంచి అధికార ప్రతినిధులను నియమిస్తున్నామన్నారు. మీడియా వారు ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి వివరాలు కావాలన్నా.. ఈ ఇద్దరు మంత్రులను సంప్రదించాలని సూచించారు. వాళ్లు ఇచ్చే సమాచారమే అధికారిక సమాచారం అని స్పష్టం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular