కులగణన ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశమంతా కలుగణన జరగాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయా వర్గాలకు వారి హక్కులు లభించాలంటే ఎవరు ఎంతమంది ఉన్నారన్న లెక్క తేలాల్సి ఉందన్నారు. ఏం సంస్థలలో దళితులు, ఆదివాసీలు, ఇతర వెనకబడిన వర్గాలకు వారి వాటా దక్కడం లేదన్నారు. ఆదానీ, అంబానీ కంపెనీల ఉద్యోగుల జాబితా తీస్తే కూడా ఇది తెలుస్తుందన్నారు. ఇకపోతే రాజ్యాంగమే కాంగ్రెస్ ఆత్మ అని, దానిని పరిరక్షించుకునేందుకు మనమంతా కలసి పోరాడాలని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మత స్వేచ్ఛ ద దాడి చేస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన 84వ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం, మన ఐడియాలజీ అని, దానిని మనమే కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ రాజ్యాంగమని.. అందుకే బీజేపీ ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు మన రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
ఇది తన బాధ్యత అన్నారు. బీజేపీ తమ వ్యవస్థ ద దాడి చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణాలో కులగణ అంశంపై స్పందించారు. కులగణనపై మంచి స్పందన వచ్చిందన్నారు. మైనార్టీలు, ఆదివాసులు, గిరిజనుల కోసం కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. జాతీయ జన గణన చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలో కుల గణనపై రేవంత్ రెడ్డి నాకు వివరించారు. తెలంగాణలో ఓసీలు, బీసీలు మైనార్టీలు ఎంత అనేది తేలింది. తెలంగాణ లో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. దేశానికే ఆదర్శంగా నిలిచాం. రాష్ట్రంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసులకు సరైన ప్రాతినిధ్యం లేదని స్పష్టమైంది. బీసీల రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిల్లు కేంద్రానికి పంపారు.
రేవంత్‌రెడ్డి పంపిన బిల్లుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణలో కులగణనను విజయవంతంగా నిర్వహించారు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కులగణన వల్ల దేశంలో బీసీల సంఖ్య ఎంతో తెలుస్తుంది. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి మార్గం చూపింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అంశాన్ని తొలగిస్తాం. తెలంగాణలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. తెలంగాణ సంపదలో మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన భాగస్వామ్యం లేదు. వారి జనాభాకు అనుగుణంగా సంపదలోనూ తగిన వాటా అవసరం‘ అని రాహుల్ గాంధీ అన్నారు. దేశ జనాభాలోని 90 శాతం మంది జనాభాకు సరైన ప్రాతినిధ్యం లేదు. 90 శాతం మంది జనాభా అవకాశాలను లాగేసుకున్నారు. రందరూ లేకుండానే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేయగలడా? అని ప్రశ్నించారు.
మహాత్మ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, అంబేద్కర్, గురునానక్, కబీర్ ఆలోచనల రూపం భారత రాజ్యాంగం అని రాహుల్ గాంధీ అన్నారు. భారత రాజ్యాంగం 75 ఏళ్ల నాటి పుస్తకంగా భావించరాదని.. వేలాది సంవత్సరాలుగా భారత దేశ ప్రజల ఆలోచన విధానమే భారత రాజ్యాంగం అని స్పష్టం చేశారు. రాజస్థాన్ లో సీఎల్పీ నేత దళితుడని.. గుడిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారన్నారు. ఆయన గుడికి వెళ్లిన పాపానికి గుడిని శుభ్రం చేశారని అన్నారు. ఇది బిజెపి ఆలోచనా విధానామని, కానీ తమ కార్యకర్తలు దళితులు, ఆదివాసులు అందరికీ గౌరవం ఇస్తారని చెప్పారు. దేశ సమస్యలు తీర్చాలంటే.. దేశాన్ని ఎక్స్‌రే తీయాలని కాంగ్రెస్ అగ్రనేత అన్నారు. దళితులు, ఆదివాసీల సమస్యలపై దృష్టిపెట్టాలన్నారు. దళితులు, ఆదివాసీలకు న్యాయం జరుగుతోందా అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. వారి సమస్యలను పరిష్కరించేం దుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని రాహుల్ విమర్శించారు. చనిపోయాక నా గురించి ప్రజలు ఏం ఆలోచిస్తారనేది అనవసరం.
నేను అనుకున్న పనులు పూర్తి చేశాక ప్రజలు మరిచిపోయినా నాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని మోదీ ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నారు. ఇద్దరు వ్యాపారవేత్తలకే వాటిని అప్పగిస్తున్నారు. ఎయిర్‌పోర్టులు, గనులు, సిమెంట్, స్టీల్ సహా కీలక పరిశ్రమలన్నీ ఓ పారిశ్రామికవేత్తకే కట్టబెడుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో భాజపా అక్రమాల ద్వారా గెలిచింది. అక్కడ ఓటరు జాబితా కోరితే ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, భాజపా రోజూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. దేశంలో కులగణన చేపట్టాలని ప్రధాని మోదీని కోరాం. దీనికి ప్రధాని సహా ఆర్‌ఎస్‌ఎస్ తిరస్కరించింది. లౌకిక భావనకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకం అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇకపోతే మోడీకి అత్యంత సన్నిహితుడైన ట్రంప్ టారిఫ్‌లతో ఆర్థిక ఉత్పాతం దూసుకు వస్తోందని హెచ్చరించారు. బంగ్లా తాత్కాలిక సారథితో సమావేశంలోనూ మోడీ నోరు మెదపలేదని అన్నారు. ఎప్పుడూ తనగురించి గొప్ప చెప్పుకునే మోడీ తన దారేందో చెప్పరని, కానీ ఇందిరా ఓ సమయంలో తనది భారత్ దారని గర్వంగా చెప్పారని గుర్తు చేశారు. ఈ వేదికపై సోనియా, అంబికా సోనీ, ఖర్గే, కెసి వేణుగోపాలు, సిఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.