Tuesday, May 13, 2025

ఆయన సిఎస్ కాదు.. కల్వకుంట్ల ఫ్యామిలీకి నమ్మిన బంటు..!

ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సెటైర్
ఆయన సిఎస్ కాదు.. కల్వకుంట్ల ఫ్యామిలీకి నమ్మిన బంటు అని తెలంగాణ మాజీ సిఎస్ సోమేశ్ కుమార్‌పై తెలంగాణ కాంగ్రెస్ సెటైర్ వేసింది. జీఎస్టీ కుంభకోణంలో సోమేశ్‌కుమార్‌పై కేసు, వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదుతో సిసిఎస్‌లో కేసు నమోదు కావడంతో పాటు, ఎఫ్‌ఐఆర్‌లో ఐదో నిందితుడిగా పేరు అంటూ వార్త పత్రికల్లో వచ్చిన కథనాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేసింది.

అలాగే ప్రజా ధనానికి కస్టోడియన్ గా ఉండాల్సిన మాజీ సిఎస్ ప్రజాధనం దోపిడీకి మార్గదర్శిగా మారారని కాంగ్రెస్ ఫైర్ అయ్యింది. జీఎస్టీ వసూళ్లలో ఏకంగా రూ.1000 కోట్ల గోల్ మాల్ స్కాం తాజాగా బట్టబయలయ్యిందని చెబుతూ తెలంగాణలో గడచిన పదేళ్లూ స్కామ్‌ల పాలన జరిగిందనడానికి ఇది మరో నిదర్శనమని టి కాంగ్రెస్ ఎక్స్ ద్వారా ఈ ఆరోపణలు చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com