Thursday, December 26, 2024

తెలంగాణ అప్పులు 6,71,757 కోట్లు

రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ లెక్కాపత్రాలను వెలికితీసి ప్రజల ముందు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రెండు వారాల్లోనే ఆ వివరాలను బయటపెట్టింది. నాలుగు రోజుల విరామం తర్వాత బుధవారం ప్రారంభమైన శాసనసభా సమావేశాలను ఇందుకు వేదికగా తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 42 పేజీల శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెుత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నాయి. 2014 -15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లుగా ఉంది. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం అప్పు పెరిగింది. 2015-16లో రాష్ట్ర రుణ, జీఎస్డీపీ 15 .7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉంది. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లుగా ఉంది. 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98 లక్షల కోట్ల వ్యయం చేశారు. మొత్తమ్మీద రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్ల రుణభారం పెరిగింది. మొత్తం రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం అవుతుండగా.. రుణ చెల్లింపులకు 34 శాతం అవుతోంది. బడ్జెట్ కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com