డిసిలు, ఎసిలు అశించిన స్థాయిలో విధులు నిర్వహించడం లేదు
పనితీరు కనబరచని అధికారులు, సిబ్బందిపై చర్యలు
ప్రతి నెలా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది
పనితీరుపై నివేదికలు అందచేయాలి
అధికారులకు ఎక్సైజ్ కమిషనర్ అదేశాలు
నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు కృషి చేయాలని, కిందిస్థాయి సిబ్బందితో సమర్ధవంతంగా పని చేయించనప్పుడే మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ పేర్కొన్నారు. అబ్కారీ భవన్‌లో అన్ని జిల్లాల డిసిలు, ఎసిలతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ప్రధానంగా డిసిలు, ఎసిలు అశించిన స్థాయిలో విధులను నిర్వహించడం లేదని కమిషనర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ పని తీరులో కనబరుస్తున్న నిర్లక్షంపై ప్రభుత్వం సీరియస్ ఉందని, త్వరలో ఉన్నతాధికారులతో జరిగే సమావేశానికి సoబంధిత శాఖ అధికారులు అన్ని రికార్డులతో హాజరుకావాలని కమిషనర్ ఆదేశించారు. మారుమూల జిల్లాలతో పాటు నగరానికి దగ్గరగా ఉన్న జిల్లాలో అశించిన స్థాయిలో నాటుసారా తయారీ, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ దిగుమతులపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇతర ఎక్సైజ్ యంత్రాంగం గట్టి నిఘా పెట్టాలని అదేశించారు. ప్రతి నెలా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పనితీరుపై నివేదికలు తయారు చేసి ఇవ్వాలన్నారు. కొందరు ఎక్సైజ్ అధికారులు స్థానికంగా ఉండడం లేదని ఫిర్యాదులు వచ్చాయని, ఇక నుంచి హెడ్ క్వార్టర్‌లోనే అధికారులు ఉండాలని కమిషనర్ అదేశించారు.
బాగా పనిచేసిన వారికి ప్రశంస పత్రాలు
ఇక నుంచి పనితీరు కనబరచని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, బాగా పనిచేసిన వారికి ప్రశంస పత్రాలు అందిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు వారికి రావాల్సిన ప్రమోషన్లు ఇతర బెన్‌ఫిట్స్ ఇవ్వడానికి అవసరమైన చర్యలు చేపడతామని కమిషనర్ హామీ ఇచ్చారు. తెలంగాణలో బీర్ల కొరత లేకున్నా ఇంకా బీర్ల కొరత ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై ఆయా ప్రాంతాల్లోని ఎక్సైజ్ అధికారులు స్పందించాలని కమిషనర్ సూచించారు. కింగ్ ఫిషర్ బీర్లు అందరికీ అందబాటులో ఉన్నాయని, వాటిని మద్యం దుకాణదారులు పక్కదారి పట్టిస్తున్నారని ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ అపమత్తంగా ఉండాలన్నారు. ఎక్కువ ధరలకు అమ్మకుండా చూడా లన్నారు. పధానంగా ఈ మధ్య కాలంలో సైబర్ క్రైం పెరిగి పోయిందన్న విష్ణయాన్ని అందరూ గుర్తించుకోవాలన్నారు. కమిషనర్ల అధికారుల పేర్లతో డబ్బులు కావాలని ఎవరైనా అడిగితే డబ్బులు ఇవ్వొద్దని, సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దని కమిషనర్ సూచించారు. బదిలీలు జరుగుతున్నాయని, మీకు ఫలానా పోస్టింగ్ ఇప్పిస్తామని కూడా మోసం చేసే వాళ్లు పుట్టుకొచ్చారని, వారి విషయంలో కూడా అపమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ అజయ్‌రావుతో పాటు బ్రూవరీస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్ర హం, అన్ని జిల్లాల డిసిలు,ఎసిలు, ఇతర అధికారులు పాల్గన్నారు.