* తెలంగాణ లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ..
* 44 మంది ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
తెలంగాణలో ఉన్నతాధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. మొన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం.. తాజాగా భారీగా అధికారులను బదిలీ చేసింది. మొత్తం 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. జీహెచ్ఎంసీ కమిషనర్ సహా కీలక శాఖల ముఖ్య కార్యదర్సులను ఇతర శాఖలకు ట్రాన్స్ఫర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోజ్ బదిలీ చేసిన రేవంత్ సర్కార్.. జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలిని నియమించింది. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ బదిలీ అయ్యారు. యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ ను నియమించారు.
బదిలీ అయిన అధికారుల వివరాలు..
ఎనిమల్ హస్బండ్రీ ప్రిన్సిపల్ సెక్రటరీగా సవ్యసాచి గోష్ ఐఏఎస్
లేబర్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ఇన్సూరెన్స్ సెక్రటరీగా సంజయ్ కుమార్ ఐఏఎస్
టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీగా వాణి ప్రసాద్ ఐఏఎస్
హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా శైలజ రామయ్య ఐఏఎస్
ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా అహ్మద్ నదీమ్ ఐఏఎస్
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా సందీప్ కుమార్ సుల్తానియా
కమర్షియల్ టాక్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా రజ్వీ ఐఏఎస్.
జిఏడి సెక్రటరీగా సుదర్శన్ రెడ్డి ఐఏఎస్.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ గా బుద్ధ ప్రకాష్ ఐఏఎస్
ఫిషరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ప్రియాంక అలా ఐఏఎస్.
టూరిజం డైరెక్టర్ గా త్రిపాఠి ఐఏఎస్.
డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ గా నరసింహారెడ్డి ఐఏఎస్ నియామకం
హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా గౌతమ్ ఐఏఎస్.
సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రెటరీగా అలుగు వర్షిని ఐఏఎస్.
వాటర్ బోర్డు ఎండిగా అశోక్ రెడ్డి ఐఏఎస్.
ఐటీ డిప్యూటీ సెక్రటరీగా భవిష్ మిశ్రా ఐఏఎస్.
పొల్యూషన్ కంట్రోల్ సెక్రెటరీగా జి రవి ఐఏఎస్.
స్పోర్ట్స్ ఎండిగా బాలాదేవి ఐఎఫ్ఎస్.
జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ బదిలీ.
జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ను విద్యుత్ శాఖ సెక్రటరీగా నియామకం
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ గా ఏవి రంగనాథ్ ఐపీఎస్ నియామకం.
హెచ్ఎండిఏ కమిషనర్ గా సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్.
జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలి కాటా
ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రటరీగా హరిచందన ఐఏఎస్.
టూరిజం ఎండిగా ప్రకాష్ రెడ్డి ఐపీఎస్