Saturday, November 16, 2024

నిర్ణయం తీసుకోండి..! లేదంటే సుమోటోగా స్వీకరిస్తాం

  • నిర్ణయం తీసుకోండి..!
  • లేదంటే సుమోటోగా స్వీకరిస్తాం
  • పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం హైకోర్టు ఆదేశాలు

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ పెరిగిపోయింది. అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని ఇటీవల బీఆర్‌ఎస్ నేతలు కౌశిక్‌రెడ్డి, వివేకానందగౌడ్‌ పిటిషన్‌ వేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని అందులో పేర్కొన్నారు. దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కీలక తీర్పు వెల్లడించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. పలు దఫాలుగా వాదనలు విన్నది. అనంతరం తీర్పును సోమవారం ఉదయానికి వాయిదా వేసింది. ఈ కేసులో హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని తెలిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్‌ఎస్ పిటిషన్ వేసింది. దానిపై విచారించిన ధర్మాసనం.. తాజా ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్​ నేత హరీష్‌ రావు అన్నారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టని తెలిపారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడటం ఖాయమని హరీష్‌ రావు స్పష్టం చేశారు. అనర్హత కారణంగా ఉపఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​గెలుపు తథ్యమని ఎక్స్‌ వేదికగా హరీష్‌ రావు తెలిపారు. తాము పార్టీ మారినప్పుడు పార్టీని విలీనం చేశామని, కాని ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జరిగింది పార్టీ ఫిరాయింపని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మూడు నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయని తెలిపారు.

అనర్హత పిటిషన్ల వ్యవహారంలో స్పీకర్‌కు ఇమ్యూనిటీ ఉండదని హైకోర్టులో బీఆర్ఎస్​తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది గండ్ర మోహన్‌రావు అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన 24 గంటల్లోనే వారిపై అనర్హత వేటు వేసిన విషయాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చినట్టు ఆయన తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ నాలుగు వారాల్లోగా స్పీకర్‌ చర్యలు తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే..
దానం నాగేందర్, – ఖైరతాబాద్
ప్రకాష్ గౌడ్, – రాజేంద్రనగర్
గూడెం మహిపాల్ రెడ్డి, – పటాన్ చెరు
కాలె యాదయ్య, – చేవెళ్ల
అరికెపూడి గాంధీ, శేరిలింగంపల్లి
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, – గద్వాల్
ఎం సంజయ్ కుమార్ , – జగిత్యాల
పోచారం శ్రీనివాస్ రెడ్డి, – బాన్సువాడ
తెల్లం వెంకట్రావు, – భద్రాచలం
కడియం శ్రీహరి, – స్టేషన్ ఘన్‌పూర్

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular