Sunday, November 17, 2024

తెలంగాణ హైకోర్ట్‌లో జానీమాస్టర్‌కి ఊరట

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌ గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలసిందే. దీనికి సంబంధించి ఆయనకు తెలంగాణ హైకోర్ట్‌లో భారీ ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన అసిసెంట్ ను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు పోలీసులకు పిర్యాధు చేసింది. దీంతో జానీ మాస్టర్ పై సెప్టెంబర్ 16 వతేదీన నార్సింగి పోలీసులు 376,506,323 సెక్షన్ కింద కేసును నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత కోర్టు ఆయన‌కు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో అక్టోబ‌ర్‌ 6 నుంచి 9 వరకు జానీ మాస్ట‌ర్‌కు కోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్‌ మంజూరు చేసింది. ఆ గడువు ముగిసిన త‌ర్వాత‌ మళ్లీ జైలుకు వెళ్లారు. అయితే ఈ మధ్యలో తన నేషనల్ అవార్డును కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఆ కేసులో జానీ మాస్టర్ కు తెలంగాణ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జానీ మాస్టర్ ఈ రోజు సాయంత్రం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, బెయిల్ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే హైకోర్టు మాత్రం జానీ మాస్టర్ కు బెయిల్ ఇచ్చేందుకే మొగ్గు చూపింది. అలాగే ఆయన బెయిల్ కు ఎలాంటి షరతులు కూడా విధించలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular