Sunday, September 29, 2024

తెలంగాణలో మధ్యం ప్రియులకు షాక్ ఇవ్వనున్న సర్కార్

* తెలంగాణలో మధ్యం ప్రియులకు షాక్ ఇవ్వనున్న సర్కార్
* త్వరలోనే పెరగనున్న మధ్యం ధరలు
తెలంగాణలో మందుబాబులకు షాక్ తగలబోతోంది. అవును మధ్యం ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కావాల్సిన బ్రాండ్ల మధ్యం, బీర్లు దొరకక మందుబాబులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇటువంటి సమయంలో మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ సర్కారు రేడీ కావడం చర్చనీయాంశమవుతోంది.
మామూలుగా ఐతే రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకోసారి మద్యం ధరలు పెంచడం జరుగుతూ వస్తోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో మద్యం ధరలను పెంచగా.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యం ధరలను పెంచేందుకు సిద్దమైంది. ఐతే అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యం ధరలు పెంచితే ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయనే కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం లభ్యమవుతున్న అన్ని బ్రాండ్ల లిక్కర్ ధరల మీద 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీర్ల పైన 10 రూపాయల నుంచి 15 రూపాయల మేర ధరలు పెరగనున్నట్లు సమాచారం. ఇలా గనక ధరలు పెంచితే ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి అదనంగా 3 వేల నుంచి మూడున్నర వేల కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందట. అసలు ఈ ఏడాది మార్చిలోనే మధ్యం ధరలను సవరించాల్సి ఉండగా, లోక్ సభ ఎన్నికల కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తవటంతో ఇప్పుడు మధ్యం ధరలు పెంచే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular