తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్న CM రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఫ్యూచర్ కార్‌లో జర్నీ చేశారు. డ్రైవర్ లెస్ కార్‌లో ఎక్కి ఆయన ప్రయాణం చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో పర్యటన సందర్భంలో ఆయన ఈ కారు ఎక్కారు. మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన జర్నీ చేశారు.
డ్రైవర్ అవసరం లేకుండా సెన్సార్లు, GPS ట్రాకింగ్‌తో కారు ఎలా ప్రయాణిస్తుందో అడిగి తెలుసుకున్నారు. అమెరికా పర్యటన ముగించుకున్న తర్వాత.. CM టీమ్ దక్షిణ కొరియాకు వెళ్లింది. సియోల్‌లో పలువురు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు జరుగుతున్నాయి.