Tuesday, May 6, 2025

సౌమ్యుడు జ‌డ్జి మ‌ణికంఠ

ఆదివారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు ఎక్సైజ్ మేజస్ట్రేట్ ఏ. మణికంఠ కు తెలంగాణ న్యాయమూర్తుల సంఘం మరియు పలువురు న్యాయమూర్తులు నివాళులర్పించారు. 2016 వ సంవత్సరంలో అతి పిన్న వయసులో న్యాయమూర్తిగా ఎంపికైన మణికంఠ గతంలో ఆలేరులో, ప్రస్తుతం హైదరాబాదులోన్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సౌమ్యుడిగా వివాదరహితుడిగా పేరు పొందిన ఏ. మణికంఠ తను న్యాయమూర్తిగా పని చేసే కోర్టులలో సహచర న్యాయమూర్తుల, న్యాయవాదుల, న్యాయ శాఖ ఉద్యోగుల మన్ననలను పొందారు. మంచి భవిష్యత్తు కలిగిన యువ న్యాయమూర్తి మానసిక వత్తిడికి గురై నిన్న ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధాకరమని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ప్రతినిధులు నివాళులర్పించారు. సోమ‌వారం అంబర్ పేటలోని మణికంఠ నివాస గృహాన్ని సందర్శించిన పలువురు న్యాయమూర్తులు, న్యాయమూర్తి సంఘం ప్రతినిధులు మణికంఠ ఇల్లు పూలమాలలతో నివాళులు ఘటించారు. పలువురు సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు , న్యాయ శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో విచ్చేసి ఏ. మణికంఠ కు నివాళులను అర్పించారు.

తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం ప్రతినిధులు మణికంఠ తల్లిదండ్రులను పరామర్శించి తెలంగాణా న్యాయమూర్తుల సంఘం వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియ జేశారు. తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం మాజీ అధ్యక్షులు, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులు కే. ప్రభాకర్ రావు ప్రధాన కార్యదర్శి కే. మురళీ మోహన్, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి ప్రేమావతి న్యాయమూర్తుల హౌసింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జీవన్ కుమార్ న్యాయమూర్తుల సంఘ సహాయ కార్యదర్శి కే. దశరధ రామయ్య ఎగ్జిక్యూటివ్ సభ్యులు మండా వెంకటేశ్వర రావు ఎం. రాజు, సంపత్, ఫరాన్ కౌసర్ జోనైల్ జస్టిస్ న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీమతి రాధిక, న్యాయమూర్తి ప్రతిమ తదితరులు మణికంఠకు నివాళులు అర్పించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com