Friday, May 16, 2025

తెలంగాణ వైద్య మండలి నాలుగు బృంధాలుగా ఆకస్మిక తనిఖీలు

  • వికారాబాద్, పరిగి, తాండూర్, మొయినాబాద్ ప్రాంతాల్లో లో తెలంగాణ వైద్య మండలి నాలుగు బృంధాలుగా ఆకస్మిక తనిఖీలు
  • పరిగి లో నకిలీ వైద్యుల పరుగో పరుగు…
  • నకిలీ వైద్యుల గుండెల్లో గుబులు

వికారాబాద్ జిల్లాలో తెలంగాణ వైద్య మండలి నాలుగు బృంధాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వికారాబాద్, పరిగి, తాండూర్ ప్రాంతాల్లో 30 మంది నకిలీ వైద్యుల సెంటర్ లపై తనిఖీ లు నిర్వహించి అర్హత లేకుండా వైద్యం చేస్తూ, చట్ట విరుద్ధంగా, ఆశాస్త్రియంగా ఆంటిబయోటిక్స్. స్టేరోయిడ్స్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ వైద్యులు / RMP / పీఎంపీ లను గుర్తించి తగు ఆధారాలు, ఉపయోగిస్తున్న మందులని సేకరించారు.

పరిగి లో తనిఖీ ల విషయం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నలుగురు నకిలీ వైద్యులు తాళాలు వేసి పరారు అయ్యారు. వికారాబాద్ జిల్లాలో మొదటి సారి టీజీఎంసీ తనిఖీ నిర్వహించడం జిల్లా అంతటా చర్చనీయంగా మారింది. ఈ 20మంది నకిలీ వైద్యుల పైన NMC చట్టం 34,54 ప్రకారం కేసు వేయనున్నట్లు, వీరికి సంవత్సరం జైలు శిక్షతో పాటు 5 లక్షల వరకు జరిమానా వేసే అవకాశం ఉంది వైస్ చైర్మన్ డా శ్రీనివాస్ తెలియ చేశారు.

Rmp / Pmp లు వైద్యులు కారని వారు అర్హతకి మించి ఆశాస్త్రియ వైద్యం చేస్తున్నారని ఇటువంటి నకిలీ వైద్యుల అందరిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఈ సెంటర్ లని క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం ప్రకారం సీజ్ చేయాలనీ వికారాబాద్ జిల్లా వైద్యధికారికీ సిఫార్సు చేయనున్నట్లు చైర్మన్ డా మహేష్ కుమార్ తెలియచేసారు.

ఈ తనిఖీలలో టీజీఎంసీ Vice chairman జి. srinivas adminstrative కమిటీ చైర్మన్ డా ఆనంద్, సభ్యుడు డా విష్ణు, డా ఇమ్రాన్ అలీ, కో అప్ట్ సభ్యులు డా ఫణి, డా అరుంధతి సాయి,డా విజయ్, డా రాజీవ్ Ima వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డా sadhu satyapradad,Dr శ్రీకాంత్, డా మధుసూదన్
ima తాండూర్ doctors dr సంతోష్ dr ambaprasad dr anil పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com