ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు కేటాయించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ప్రసార మాధ్యమాల్లో కొత్తగా అయిన మంత్రులకు శాఖలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ప్రభుత్వం ఇంకా మంత్రులకు శాఖల కేటాయింపుల్ని చేయలేదు. శాఖల కేటాయింపులు జరిగినట్టు ప్రసారం అవుతున్న వార్తలను ప్రజలు నమ్మవద్దు. మంత్రులకు శాఖల కేటాయింపుల వివరాలు ప్రభుత్వం ఆదేశాల రూపంలో ప్రకటిస్తుందని గుర్తుంచుకోవాలి.