Wednesday, October 16, 2024

ఫార్ములా పారుతుందా..?

  • మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో చక్రం తిప్పనున్న తెలంగాణ మంత్రులు
  • భట్టి, సీతక్క, ఉత్తమ్‌కు కీలక బాధ్యతలు
  • ఈ రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులను నియమించిన ఏఐసీసీ

దేశంలో మరో రెండు రాష్ట్రాలకు ఎన్నికల నాగారా మోగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాగంగా.. హర్యానాలో కాంగ్రెస్‌ పార్టీకి ఊహించిన ఫలితం దక్కకపోవటంతో.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. ఈ మేరకు ఎన్నికలు జరుగుతున్న రెండు రాష్ట్రాలకు సీనియర్ నేతలను పరిశీలకులుగా నియమించింది. ఇందులో మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది.
దేశంలో మొన్ననే హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికలు పూర్తవగా ఇప్పుడు మరో రెండు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వేళ తెలంగాణలోని కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామనుకున్న హర్యానలో కొంచెంలో అధికారం చేజారిపోవటంతో.. ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ అధిష్ఠానం ముమ్మర కసరత్తు చేస్తోంది.

ఈ క్రమంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేతలను పరిశీలకులగా నియమించింది. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది అధిష్ఠానం. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మహారాష్ట్రలోని 5 డివిజన్లకు గానూ.. 11 మంది సీనియర్లను నియమించిన ఏఐసీసీ.. వారిలో తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కను ఎంపిక చేసింది. మరాఠ్వాడా రీజియన్ పరిశీలకులుగా సచిన్ పైలట్‌తో పాటు మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డిని నియమించగా… నార్త్ మహారాష్ట్రకు మంత్రి సీతక్కతో పాటు సయ్యద్ నసీర్ హుస్సేన్‌ను పరిశీలకులుగా అధిష్ఠానం నియమించింది. ఇదిలా ఉంటే.. జార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేతలు అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని పరిశీలకులుగా అధిష్ఠానం నియమించింది. మహారాష్ట్రలో ఒకే విడతలో 288 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, జార్ఖండ్‌లో ఉన్న 81 స్థానాల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన ఎన్నికలు జరగనుండగా జార్ఖండ్‌లో తొలి విడత ఎన్నికలు నవంబర్ 13వ తేదీన నిర్వహించనుండగా.. రెండో విడత నవంబర్ 20వ తేదీన జరుపనున్నారు.

మన ఫార్ములా పారుతుందా..?
మహారాష్ట్రపై కాంగ్రెస్​ ఈసారి ఆశలు పెట్టుకున్నది. బీజేపీలో లుకలుకలు, శివసేనలో కొట్లాటలు కాంగ్రెస్​కు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్​ పార్టీ.. తెలంగాణ ఫార్ములాను మరాఠాలో వినియోగించనున్నది. అక్కడ మేనిఫెస్టో తయారీకి సైతం తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డితో పాటుగా పలువురు సీనియర్లకు అప్పగించింది. తెలుగు మూలాలు కూడా అక్కడ ఉండటంతో.. కొంత కలిసి వస్తుందని అంచనాలు వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular