Sunday, April 20, 2025

పసుపు కేతనం టీడీపీలోకి ఎమ్మెల్యేలు

గ్రేటర్​ఎన్నికల్లో పోటీకి ప్లాన్​

తెలంగాణ టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ బలోపేతానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. అందులో భాగంగా కొందరు బీఆర్‌ఎస్‌ లీడర్లు సీబీఎన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కుతున్నాయి. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న టీడీపీని పరుగులు పెట్టించే చర్యలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో వరుసగా సమావేశమవుతున్నారు. చాలా రోజుల క్రితం బాబూ మోహన్ లాంటి వాళ్లు సమావేశమయ్యారు. ఇప్పుడు మరికొందరు హైదరాబాద్ నేతలు భేటీ కావడంతో ఆసక్తి నెలకొంది.

నేనైతే చేరుతా
సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు. మరో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడిన నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లో జరిగే పెళ్లి వేడుకకు చంద్రబాబును ఆహ్వానించేందుకే తాను సమావేశమైనట్టు మల్లారెడ్డి ప్రకటించారు. అంతకు మించి ప్రాధాన్యత లేదని అన్నారు. తాను మాత్రం టీడీపీలో చేరుతానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి ప్రకటించారు. త్వరలోనే మంచి రోజు చూసుకొని చేరుతున్నట్టు ప్రకటించారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కచ్చితంగా టీడీపీ పాలన రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు.

అప్పుడు ఎన్టీఆర్ హయాంలో ప్రజలకు పాలన ఫలాలు లభించాయని తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కారణంగా హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందన్నారు. అందుకు తానే సాక్ష్యమని అన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన ప్రణాళిలు సిద్ధంగా ఉన్నాయని తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై చర్చించేందుకే చంద్రబాబు సమావేశమైనట్టు చెప్పుకొచ్చారు. అయితే వేరే పనుల్లో బిజిగా ఉన్న చంద్రబాబు వీటి గురించి తర్వాత మాట్లాడదామంటూ చెప్పారన్నారు. ఇన్ని రోజులు గుర్తింపు కలిగిన పెద్ద లీడర్ ఎవరూ లేకుండా ఉన్న టీడీపీకి తీగల పెద్దదిక్కు కానున్నారనే చర్చ నడుస్తోంది. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా ఇంత వరకు ఫిల్ చేయలేకపోయింది అధినాయకత్వం. వరుస ఎన్నికల కారణంగా దీనిపై నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నా… అందుకు తగ్గ లీడర్ లేరనే వాదన కూడా ఉంది.

ప్రత్యామ్నాయమేనా..?
గ్రేటర్​లోని పలువురు నేతలు ఇప్పటికే టీడీపీలోచేరేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. కొంతమంది చేరారు కూడా. అయితే, ఇటీవల కాంగ్రెస్​పై వ్యతిరేకత పెరుగుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలో టీడీపీ అధికారంలో ఉండటంతో.. ఆ పార్టీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఇప్పుడు టీడీపీలో చేరేందుకు కీలకమైన నేతలు అంగీకరం తెలుపుతున్న వేళ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు సాగించాలని తెలంగాణ నేతలు సూచిస్తున్నారు.

పార్టీకి ఎవరు ఎంత వరకు అవసరమో గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. మరోసారి వలస నేతలను నమ్ముకుంటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు తీగల కృష్ణా రెడ్డి రాజకీయ జీవితం టీడీపీ నుంచే ప్రారంభమైంది. హైదరాబాద్‌ మేయర్‌గా పని చేసి అభివృద్ధిలో భాగమయ్యారు. 2002 నుంచి 2007 వరకు ఆ పదవిలో ఉన్నారు. అదే అనుభవంతో 2009 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో కూడా అదే నియోజవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యేందుకుగ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

గ్రేటర్​ ప్లాన్​
త్వరలోనే గ్రేటర్​ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో ముందుగా పాగా వేయాలని టీడీపీ భావిస్తున్నది. ఎలాగూ తమకు పార్టీ కేడర్​ బలంగా ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్​ఎన్నికలకు ముందు కీలక నేతలను పార్టీకి చేర్చుకునే విధంగా కూడా ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తున్నది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com