Wednesday, December 25, 2024

ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా తెలంగాణ తల్లి విగ్రహం

రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటనపై ఆయన మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అభిప్రా యం చెప్పకుండా బయట ఉండడాన్ని చూస్తే వారికి అధికారంపైనే ప్రేమ, తాపత్రయం ఉందన్న అభిప్రాయం కలుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సభలో ఒకసారి ప్రకటన చేసిన తర్వాత దానిపై సహజంగా చర్చే ఉండదు.. కానీ అందుకు భిన్నంగా కొత్త సాంప్రదాయానికి తెరలేపుతూ ప్రకటనపై సభ్యులందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పాలని కోరారు. అయితే బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండటం చూస్తే వారికి తెలంగాణపై, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రేమ లేదని సభ్యులంతా భావిస్తున్నారని భట్టి విక్రమార్క  తెలిపారు. 13 డిసెంబర్‌ 2014 లో ఇదే సభలో నాటి సీఎం మాట్లాడుతూ.. సోనియాగాంధీకి హృదయపూర్వక కృత జ్ఞతలు చెప్పారు. ఆమె చొరవతోనే తెలంగాణ ఏర్పడిరది. అందులో ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదని చెప్పారని  ఇది అసెంబ్లీ రికార్డుల్లో ఉందని కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కొన్ని దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంటే డిసెంబర్‌ 9న యూపీఏ చైర్‌ పర్సన్‌ గా సోనియా గాంధీ తన జన్మదినం సందర్భంగా హోంమంత్రి చిదంబరంతో అధికారికంగా ప్రకటన చేయించారని గుర్తుచేశారు.

సభ్యులు సభలో ఉండి తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియాగాంధీని, ఆమె నిర్ణయాన్ని.. తెలంగాణ అమరుల కలలు నిజం చేసిన ఆమె ప్రకటనకు సభ మొత్తం ఏకగ్రీవంగా కృతజ్ఞతలు చెప్పాల్సి ఉందన్నారు.  రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో అద్భుతంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతుందని, రాష్ట్రం మొత్తం పండుగలా జరుపుకుంటుంటే ఈ పండుగ మాకు అవసరం లేదని బిఆర్‌ఎస్‌ నేతలు బయటికి వెళ్లి ఏ సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం, ప్రతిపక్షం అభిప్రాయాలు చెబితేనే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని… పెద్దల సభ శాసనమండలిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై తాను ప్రకటన చేస్తే సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని.. హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. కేటీఆర్‌, హరీష్‌ లు సభలో ఉండి అభిప్రాయాలు చెబితే బాగుండేది. వారు మమ్మల్ని పొగడాలని, తెలంగాణ తల్లి విగ్రహం గొప్పగా ఉందని చెప్పాలని తాము కోరుకోవడం లేదని అన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో సభను నడిపామని, తెలంగాణ బిల్లు చర్చకు వొచ్చినప్పుడు తాను డిప్యూటీ స్పీకర్‌ గా, శ్రీధర్‌ బాబు శాసనసభ పక్ష వ్యవహారాల మంత్రిగా అందరికీ అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. ఆనాడు అంతా సభలోనే ఉండి అభిప్రాయాలు చెప్పారు. ఎవరు కూడా సభను వదిలి వెల్లలేదు.. ఆనాడు తీవ్ర భావోద్వేగాలు ఉన్నా  అందరూ సభలోనే ఉండి వారి వారి అభిప్రాయాలు తెలియజేశారని వివరించారు. తెలంగాణ తెలంగాణ తల్లి ఉత్సవాలను డిసెంబర్‌ 9న అధికారికంగా నిర్వహించాలని, ఈ కార్యక్రమం నిరంతరం అధికారికంగా ప్రతీ సంవత్సరం నిర్వహిస్తామని ఇది మనందరి బాధ్యత అని అన్నారు. ఆగస్టు 15 జనవరి 26 పండగల జరుపుకుంటాం.. డిసెంబర్‌ 9న కూడా అధికారిక నిర్వహణకు గెజిట్‌ విడుదల చేసి అధికారిక లాంచనాలు పూర్తి చేస్తామన్నారు.

తెలంగాణ ప్రజల మనోభావాలకు అద్దం
తెలంగాణ తల్లి విగ్రహం చూస్తుంటే ఒక అమ్మ, ఒక నాయనమ్మ కనిపిస్తున్నారు.. చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. పంటల పచ్చదనానికి ఆకుపచ్చ చీర ప్రతిబింబం, రాజ్య హింస పెరిగినప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు దానికి పీఠం పైన పిడికిళ్ళు, ఎరుపు ప్రగతిశీల భావాలు ఉద్యమాలకు గుర్తు, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ సుభిక్షంగా ఉండాలని ఆపన్న హస్తంతో ఆశీర్వదిస్తారు, తెలంగాణలో పండే పంటలన్నీ తల్లి చేతిలో చూపిస్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విగ్రహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని ఈ విగ్రహం తెలంగాణ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుందని అన్నారు. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని విగ్రహ ఏర్పాటును విజయవంతంగా పూర్తి చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com