Wednesday, February 12, 2025

కొత్త చిహ్నం డిజైన్​ ఇదే

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త అధికారిక చిహ్నాన్ని ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. కొత్త చిహ్నం రూపొందించడంలో రూపకర్త రుద్ర రాజేశం బృందం బీజీగా ఉండగా.. బుధవారం ఉదయం కొన్ని నమూనాలను సీఎంకు చూపించారు. వారు సిద్ధం చేసిన కొన్ని లోగోలను సీఎం రేవంత్ రెడ్డి పరిశిలించారు. అందులో ఒకదానిని సెలక్ట్ చేసి కొన్ని మార్పు చేర్పులు సూచించినట్లుగా తెస్తున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం వెల్లివిరిసేలా 40కి డిజైన్లు రూపొందించారు.

డిజైన్లను ఫైనల్ చేసే పనిలో రేవంత్ రెడ్డి
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖరారు చేసిన లోగో రాచరిక పోకడలతో ఉందని.. అమరుల త్యాగాలు ఎత్తిపట్టేలా తెలంగాణ చిహ్నం ఉండాలని రేవంత్ నిర్ణయించారు. తెలంగాణ కోసం బిడ్డలు ప్రాణ త్యాగం చేశారని. వారి త్యాగాలు ఉట్టిపడేలా చిహ్నం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి రుద్ర రాజేశంకు సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా లోగోను ఖరారు చేస్తున్నారు. తెలంగాణ చిహ్నం చూశాక ప్రజలు తప్పకుండా సంతోషిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com