రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే, ఈసారి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీగా పోటీలో నిలిచారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు హస్తం పార్టీ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కేటాయించింది.
ఇదే సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ ఎంపీగా బరిలో ఉన్నారు. అయితే వీరి గెలుపును రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వీరిద్దరు కూడా పార్లమెంట్ పోరులో ఓడిపోయారు. ఓడినా ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకపోవడంతో.. యధాతథంగా ఆ పదవుల్లోనే కొనసాగనున్నారు.