Friday, December 27, 2024

Phone Tapping Case: ఇక ఫైనల్​ లిస్ట్​

  • ఫోన్​ ట్యాపింగ్​లో తుది దశ
  • ఐదుగురు నేతలకు త్వరలోనే నోటీసులు

టీఎస్​, న్యూస్​: ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న ఎస్​ఐబీ మాజీ చీఫ్​ప్రభాకర్​రావును విచారిస్తే.. విషయాలన్నీ తేటతెల్లమవుతాయని సిట్​పోలీసులు భావిస్తున్నారు. ప్రభాకర్​రావు ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో ఆయనకు లుక్​ అవుట్​ నోటీసులు జారీ చేశారు. అయితే, తాను వైద్య చికిత్స కోసం విదేశాల్లో ఉన్నానని, త్వరలోనే వస్తానంటూ రాయబారం కూడా పంపించారు. ప్రభాకర్​రావు రాగానే.. ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో ఉన్నవారందరికీ నోటీసులు ఇవ్వనున్నారు. అయితే, టాస్క్​ఫోర్స్​ మాజీ డీసీపీ రాధా కిషన్​రావు, అడిషనల్​ ఎస్పీలు ప్రణీత్​రావు, భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి తీసుకుని విచారించిన సిట్​ బృందానికి కీలకమైన వివరాలు చేతికి చిక్కాయి.

బీఆర్​ఎస్​ సుప్రీం చెప్తేనే చేశామంటూ నిందితులు ఒప్పుకున్నట్లు బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ లో ఐదుగురు నేతలే కీలకంగా వ్యవహరించినట్లు స్పష్టమైంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్​పార్టీ సుప్రీమ్ చెప్తేనే చేశామంటూ నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దీంతో ఆ పార్టీ సుప్రీమ్​, అధికారంలో ఉండగా గులాబీ పార్టీలో కీ రోల్​ నిర్వమించిన మాజీ ఎంపీ, మరో కీలక మంత్రిగా వ్యవహరించిన మాజీ మంత్రి, మరో మాజీ మంత్రి, ఓ ఎమ్మెల్సీలకు లింకులు ఉన్నాయని, వారే కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితులను విచారించిన తర్వాతే దీనిపై నిర్ధారణకు వచ్చారు. అయితే, వీరంతా ఫోన్ ట్యాపింగ్​తో అక్రమాలకు పాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలోనే కీలక విషయాలన్నీ బయటకు వచ్చాయి.

ఎస్‌ఐబీ కేంద్రంగా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు వాంగ్మూలమే కీలకంగా మారుతున్నది. ఇప్పటి వరకు అరెస్టయిన టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఇచ్చిన వాంగ్మూలాల్లో.. ప్రభాకర్‌రావు చెప్పినట్లే చేశామని పదేపదే వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం వెనక ఉన్న అసలు సూత్రధారి ఎవరో తెలియాలంటే ప్రభాకర్‌రావు అరెస్టవ్వడమో.. లొంగిపోవడమో అత్యంత ముఖ్యమని స్పష్టమవుతోంది. భుజంగరావు, తిరుపతన్నను కస్టడీలోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు జరిపిన విచారణలో ప్రభాకర్​రావు, రాధాకిషన్​రావు, ప్రణీత్​రావు పేర్లను వెల్లడించారు. ఎస్‌ఐబీ కేంద్రంగా సాగిన ఆపరేషన్స్‌ గురించి వివరించారు. ప్రణీత్‌రావు కూడా కస్టడీలో ఉన్నప్పుడు ప్రభాకర్‌రావు చెప్పింది చేశామంటూ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌కు ఆదేశాలిచ్చిన గత ప్రభుత్వ పెద్ద ఎవరు? అనేది ప్రభాకర్‌రావు మాత్రమే చెప్పగలరని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

Additional SP Venugopal Rao

అప్రూవర్​గా మారింది ఆయనేనా..?
రాధాకిషన్‌ రిమాండ్‌ రిపోర్టులో వెలుగులోకి వచ్చిన అదనపు ఎస్పీ వేణుగోపాల్‌రావును విచారించేందుకు పంజాగుట్ట పోలీసులు నోటీసులిచ్చారని బయటకు వచ్చినా.. ఆయన్ను ఎక్కడా విచారణకు పిలువలేదు. వేణుగోపాల్‌రావు ఉమ్మడి సైబరాబాద్‌లో ఎల్‌బీనగర్‌ ఏసీపీగా, పటాన్‌చెరు ఏసీపీగా, పలు ఠాణాల్లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. సైబరాబాద్‌పై మంచి పట్టు ఉండడం వల్లే.. ఎన్నికల సమయంలో ఆ కమిషనరేట్‌లో ‘స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీం’ను ఆయనకు అప్పగించినట్లు తేలింది. కానీ, ఆయన్ను ఎందుకు విచారణకు పిలువలేదనే అనుమానాలున్నాయి. అయితే, ఈ కేసులో వేణుగోపాల్​రావు అప్రూవర్​గా మారినట్లు తెలుస్తోంది.

నోటీసులు ఎవరికి ఇస్తామో త్వరలో చెప్పుతాం: సీపీ శ్రీనివాస్​ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే విషయంపై కూడా త్వరలోనే విషయాన్ని వెల్లడిస్తామని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com