Monday, April 21, 2025

తిరుమలలో తెలంగాణ సిఫారసు లేఖలు పనిచేయవు

  • తిరుమలలో తెలంగాణ సిఫారసు లేఖలు పనిచేయవు
  • ఇతర రాష్ట్రాల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదన్న ఈఓ

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక విషయంపై స్పష్టతనిచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తీసుకువచ్చే సిఫారసు లేఖలను అనుమతించబోమని టీటీడీ ఈఓ శ్యామల రావు తేల్చి చెప్పారు. అంటే తిరుమల శ్రీవారి దర్శనానాకి తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖలు పనిచేయవన్నమాట. టీటీడీ శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్యామల రావు భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ఈ సందర్బంగా తిరుమల దర్శనానికి సంబందించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు.దీనిపై స్పందించిన టీటీడీ ఈఓ శ్యామల రావు..శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ కు సంబందించిన ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి సిఫార్సు లేఖలు తీసుకువస్తే అవి చెల్లుబాటు కావని తేల్చేశారు. అందువల్ల తెలంగాణ నుంచి వెళ్లే భక్తులు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకెళ్లినా అవి పనిచేయవని గుర్తుంచుకోవాలి.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయిన సందర్బంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు అనుమతించే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఐతే రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చంద్రబాబు దగ్గర ప్రస్తావించినట్లు లెదని తెలుస్తోంది. మరి త్వరలోనే టీటీడీ బోర్డు ను నియమించబోతున్న నేపధ్యంలో తెలంగాణ నుంచి బోర్డులో అవకాశం కల్పిస్తారా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com