Sunday, April 20, 2025

మీది తెలంగాణా… మీ సిఫార్సు లేఖలు చెల్లవు తెలంగాణ కు టీటీడీ ఝలక్

ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక విషయంపై స్పష్టత నిచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తీసుకువచ్చే సిఫారసు లేఖలను అనుమతించబోమని టీటీడీ ఈఓ శ్యామల రావు తేల్చి చెప్పారు. టీటీడీ నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్యామల రావు భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‌ఈ సందర్బంగా తిరుమల దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన టీటీడీ ఈఓ శ్యామల రావు శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి సిఫార్సు లేఖలు తీసుకువస్తే అవి చెల్లుబాటు కావని తేల్చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com