Monday, May 12, 2025

సార్వత్రిక పోరులో పోలింగ్ కీలక అంకం పూర్తి​

  • 64.93 %
  • సార్వత్రిక పోరులో పోలింగ్ కీలక అంకం పూర్తి​
  • అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తక్కువే
  • అత్యధికంగా భువనగిరి
  • అత్యల్పంగా హైదరాబాద్​

సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్​ ప్రక్రియ ముగిసింది. లక్షల మంది ఓటర్లు ఏపీకి, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడంతో.. హైదరాబాద్​ పరిధిలో కొంత మేరకు తగ్గినట్లుగా కనిపించింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి లోక్​సభ ఎన్నికలకు ఓటింగ్​ శాతం తక్కువే నమోదైంది. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70.61 శాతం ఓట్లు పోలయితే.. ఈ పార్లమెంట్​ ఎన్నికల్లో 64.93 శాతం ఓట్లేశారు. ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లో ఓటర్లు క్యూ కట్టారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాలకు తరలివచ్చారు.

అత్యధికం భువనగిరి .. అత్యల్పం హైదరాబాద్

పార్లమెంట్​ ఎన్నికల పోలింగ్​లో అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో 76.47 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్ఫంగా హైదరాబాద్ నియోజకవర్గంలో 46.08 శాతం నమోదైంది. గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్ , మల్గాజిగిరిలో పోలింగ్ మందకొడిగా సాగింది. సికింద్రాబాద్ లో 48.11 శాతం, మల్కాజిగిరిలో 50.12 పోలింగ్ నమోదైంది. కాగా, భువనగిరి పార్లమెంట్​ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్​ ఉండగా.. ఆ తర్వాత ఖమ్మంలో 75.19, జహీరాబాద్​ సెగ్మెంట్​లో 74.54 శాతం, మెదక్​లో 74.38శాతం శాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈసారి ఎక్కువగా ఓట్లేశారు. ఇక, సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఈ నియోజకవర్గంలో 50.38 శాతం పోలింగ్​ జరిగింది.

వంద శాతం పోలింగ్​

సెలవు ఇచ్చినా ఓటేయకుండా పట్టణవాసులు ముఖం చాటేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెలు ఓటుతో చైతన్యాన్ని చాటారు. సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం చిన్నకొల్వాయిలో 100 శాతం పోలింగ్‌ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ ఓటేశారు.

అదేవిధ:గా మెదక్‌ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటతండాలోని అదనపు పోలింగ్‌ కేంద్రంలోనూ వంద శాతం పోలింగ్‌ జరిగింది. సంగాయిపేటతండా 62ఏ అదనపు పోలింగ్‌ కేంద్రం పరిధిలో 210 మంది ఓటర్లు ఉండగా అంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో చాలా మంది నిరక్ష్యరాలైనప్పటికీ చైతన్యంతో తమ ఓటు వేశారు.

==
2019 లోక్ సభ ఎన్నికలు 62.69
2023 అసెంబ్లీ ఎన్నికలు 70.61
2024 లోక్​సభ ఎన్నికలు 64.93
==

==
ఉదయం 9 గంటలకు 9.51 శాతం
ఉదయం 11 గంటలకు 24.31 శాతం
మధ్యాహ్నం 1 గంటకు 40.38 శాతం
మధ్యాహ్నం 3 గంటలకు 52.34 శాతం
సాయంత్రం 5 గంటలకు 61.16 శాతం
పోలింగ్​ ప్రక్రియ ముగిసే వరకు 64.93 శాతం
==
నియోజకవర్గాల వారీగా..
==
అదిలాబాద్ 72.96
భువనగిరి 76.47
చేవెళ్ల 55.45
హైద్రాబాద్ 46.08
కరీంనగర్ 72.33
ఖమ్మం 75.19
మహబూబాబాద్ 70.68
మహబూబ్​నగర్ 71.54
మల్కాజిగిరి 50.12
మెదక్ – 74038
నాగర్ కర్నూల్ 68.86
నల్గొండ 73.78
నిజామాబాద్ 71.50
పెద్దపల్లి 67.88
సికింద్రాబాద్ 48.11
వరంగల్ 68.29
జహీరాబాద్ 74.54
==
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (అసెంబ్లీ) 50.38 ( ఉపఎన్నిక)
==

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com