- మొత్తం 299 పని దినాలు
- జూన్ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం
- జూన్ 1 నుండి 11 వరకు బడిబాట కార్యక్రమం
- ప్రతి రోజూ పాఠశాలల్లో యోగా, మెడిటేషన్ క్లాస్ లు
- అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసర సెలవులు
- డిసెంబర్ 23 నుంచి 27 వరకు మిషనరీ స్కూల్స్ సెలవులు
- జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
- 2025 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు మొత్తం 49 రోజులు వేసవి సెలవులు
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను అకాడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 12 నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. 2025, ఏప్రిల్ 23 వరకు మొత్తం 229 పనిదినాలు ఉండనున్నాయి. జూన్ 1 నుండి 11 వరకు బడి బాట కార్యక్రమం జరుగనుంది. 2024 జూన్ 12న ప్రారంభమై 2025 ఏప్రిల్ 23తో అకాడమిక్ ఇయర్ ( పాఠశాలల పనిదినాలు ) ముగుస్తుంది. 2025 ఏప్రిల్ 24 నుంచి 2025 జూన్ 11 వరకు మొత్తం 49 రోజులు ఈ విద్యాసంవత్సరంలో వేసవి సెలవులు ఉంటాయి. అలాగే.. అక్టోబర్ 2 నుండి 14 వరకు (13 రోజులు) దసరా సెలవులు ఉన్నాయి. డిసెంబర్ 23 నుండి 27 వరకు 5 రోజులు మిషనరీ స్కూల్స్కి క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. అలాగే జనవరి 13 నుండి 17 వరకు 5 రోజులపాటు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. వీటితో పాటు ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో 5 నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి.
మరోవైపు 2025 ఫిబ్రవరి 28లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని హైస్కూల్స్ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగనున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ ప్రకటించింది. 2024 జూలై 31 గా ఫార్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు, 2024 సెప్టెంబర్ 30 లోపు ఫార్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.
అదే విధంగా ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 28 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు, డిసెంబర్ 12 లోపు ఫార్మేటివ్ అసెస్మెంట్-3 పరీక్షలు నిర్వహించాలని అధికారులు తెలిపారు. 2025 జనవరి 29 లోపు ఫార్మేటివ్ అసెస్మెంట్-4 పరీక్షలు, వచ్చే ఏడాది ఏప్రిల్ 9 నుంచి 29 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలను(1 నుంచి 9 క్లాస్ లకు) నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులు 2025 ఫిబ్రవరి 28లోపు ప్రీ ఫైనల్ నిర్వహించున్నారు. మార్చి, 2025లో పదో తరగతి ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్లో తెలిపింది.