రవీంద్రభారతి: బతుకమ్మ వేడుకల్లో భాగంగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో 2వ రోజు (మంగళవారం) నిర్వహించిన నృత్యప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. తెలంగాణ సంగీత అకాడమి చైర్‌పర్సన్ ఆచార్య అలేఖ్య పుంజాల అధ్యక్షతన నిర్వహిస్తున్న యువ కళోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారు, శ్రీ బాల మురళి వెంకట్, ఏమ్మెల్సీ గారు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.మామిడి హరికృష్ణ గారు హాజరయ్యారు.
యువ కళోత్సవంలో భాగంగా రెండోరోజు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీతపద్మశ్రీ డా.ఆనంద శంకర్ జయంత్, గీతా గణేషన్ శిష్య బృందం ఆధ్వర్యంలో భరతనాట్య ప్రదర్శనిచ్చారు. ప్రముఖ కూచిపూడి నృత్య గురు శ్రీమతి దీపికారెడ్డి, శ్రీ భాగవతుల సేతురాంల శిష్యబృందాలు ప్రదర్శననిచ్చాయి. ప్రముఖ కథక్ నృత్యకారులు రాఘవ రాజ్‌భట్, మంగళాభట్, సంజయ్‌జోషి శిష్యబృందాల ప్రదర్శన శ్రోతలను అలరించాయి. ప్రముఖ నాట్య గురు శ్రీ కళాకృష్ణ, శ్రీ రాజ్‌కుమార్ శిష్య బృందం ఇచ్చిన పేరిణి నాట్యం ప్రియులను ఆకట్టుకుంది. ప్రముఖ ఒడిస్సి కళాకారులు శ్రీమతి దేబశ్రీ పట్నాయక్, శ్రీమతి సుదీప్తా పాండ శిష్యబందం ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు.