Monday, November 18, 2024

బంగారు చీరను నేశిన సిరిసిల్ల చేనేత కళాకారుడు

సిరిసిల్ల చేనేత కళాకారుడు అధ్బుతం చేశాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేశాడు. సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్‌ పది రోజులపాటు శ్రమించి పసిడి కోకను నేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తన కూతురు వివాహం కోసం 200 గ్రాముల బంగారంతో చీర తయారీకి ఆర్డర్‌ ఇచ్చారు. ఆ మేరకు విజయకుమార్‌ బంగారంతో నిలువు, అడ్డం పోగులను చేనేత మగ్గంపై ప్రత్యేకంగా నేశారు. 800 నుంచి 900 గ్రాముల బరువు, 49 అంగుళాల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవుతో బంగారు చీరను రూపొందించారు. కట్టుకునేందుకు వీలుగా కొత్త డిజైన్లతో పసిడి కోకను సిద్ధం చేశాడు నల్ల విజయ్‌కుమార్‌. ఈ చీర తయారీకి బంగారంతో కలిపి మొత్తం 18 లక్షల రూపాయలు ఖర్చయినట్టు విజయ్‌కుమార్‌ తెలిపారు. చేనేత కళాకారుడి నేసిన అద్భుతమైన బంగారు చీరను చూసినవారంతా ఔరా అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular