Friday, January 31, 2025

తెలంగాణ స్పీకర్‌పై సుప్రీం కోర్టు సీరియస్‌

పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎందుకింత ఆలస్యమంటూ తెలంగాణ స్పీకర్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ జార్జి మైస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది మార్చిలో చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కౌశిక్‌ రెడ్డి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. తగిన సమయంలో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని న్యాయవాది.. అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు. దీంతో సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు అసహనం
అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి కోర్టుకు చెప్పారు. నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌, ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రోహత్గి ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేశారు. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఇంత ఆలస్యం అంటూ స్పీకర్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు తీరేవరకా అంటూ మండిపడింది. దీంతో స్పీకర్ నిర్ణయం తర్వాత డెసిషన్ చెప్తామని ముకుల్ రోహత్గి కోర్టుకు వివరించారు. ఎంత సమయం కావాలో మీరే స్పీకర్‌ను కనుక్కొని కోర్టుకు చెప్పండని రోహత్కికి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ వారం రోజులు పాటు వాయిదా వేసింది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com