Tuesday, May 13, 2025

తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల

అమరులకు నివాళులతో దశాబ్ది ఉత్సవాలు మొదలు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి వేడుకలను ప్రారంభించారు. అంతేకాకుండా రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు. అనంతరం, పోలీస్‌ సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సరిగ్గా 8 గంటలకు శాసనమండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. జాతీయ జెండా ఎగరవేశారు. 8గంటల 45 నిమిషాలకు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ జెండా ఆవిష్కరించారు. అంతకన్నా ముందు గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

రాజ్‌భవన్‌లోనూ దశాబ్ది వేడుకలు అట్టహాసంగా సాగాయి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్.. జాతీయ జెండా ఆవిష్కరించారు. ఇక గాంధీభవన్‌లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ జెండా ఎగరవేశారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, సేవాదల్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com