పెట్టుబడులకు రాష్ట్రం తెలంగాణ భూతల స్వర్గం.ప్రపంచానికి అవసరమైన మానవ వనరులు అందిస్తున్న రాష్ట్రం.ఓ ఆర్ ఆర్, త్రిబుల్ ఆర్ మధ్య అనేక క్లస్టర్లు అభివృద్ధి చేస్తాం… ఫార్మా విలేజ్ లు నిర్మిస్తాం సాటిలైట్ టౌన్ షిప్ లు ఏర్పాటు చేసి అందరికీ ఇల్లు అందుబాటు ధరలో వచ్చేలా చర్యలు తీసుకుంటాం.ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ రాష్ట్ర వార్షిక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
టీఎస్, న్యూస్: పెట్టుబడులకు రాష్ట్రం భూతల స్వర్గమని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన వనరుల, ప్రణాళికా శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం హైటెక్ సిటీ లోని ఒక ప్రైవేట్ హోటల్లో జరిగినకాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) రాష్ట్ర వార్షిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ,దేశం నలుమూలల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ సమావేశానికి రావడం సంతోషంగా ఉందన్నారు. దీనిని గర్వకారణంగా భావిస్తున్నాని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని భౌగోళిక వాతావరణం తెలంగాణలో ఉందన్నారు. ఐఐటి, త్రిబుల్ ఐటీ, ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి గొప్ప యూనివర్సిటీలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ప్రపంచానికి అవసరమైన మానవ వనరులు అందిస్తున్న రాష్ట్రం గా తెలంగాణను ఆయన అభివర్ణించారు.
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా పారిశ్రామికవేత్తలకు తలుపులు మూసివేసే పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదన్నారుయ సీఎం తో పాటు క్యాబినెట్లోని మంత్రులందరూ 24 గంటల పాటు పారిశ్రామికవేత్తల కోసం సెక్రటేరియట్ ఎప్పుడే తెరిచే ఉంటుందన్నారు.
ఇక ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య అనేక క్లస్టర్లు అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో ఫార్మాసిటీ అంటే ఒకే చోట ముప్పైవేల ఎకరాల్లో ప్రణాళికలు రూపొందించారన్నారు. కానీ అది ప్రజల ఆరోగ్యం రీత్యా సరైన విధానం కాదన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని వసతులతో కూడిన ఫార్మా విలేజిలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. ఓఆప్ఆర్, త్రిబుల్ ఆర్ ల మధ్య టెక్స్ టైల్స్, ఐటీ, డెయిరీ క్లస్టర్ లు అభివృద్ధి చేసే ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. సామాన్యులకు ఇళ్లు కొనుగోలు చుసుకునే విధంగా ధరలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వసతులతో శాటిలైట్ టౌన్ షిప్పుల నిర్మాణానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. 20- 30 ఏళ్ల క్రితం ఆసియాలోనే అతిపెద్ద హౌసింగ్ కాలనీ కూకట్ పల్లి నిర్మాణం జరిగిందన్నారు. అది నిర్మాణం జరగడంతోనే వేలాది మందికి ఆశ్రయం ఏర్పడి పరిశ్రమలు హైదరాబాదులో నిలదొక్కుకున్న విషయాన్ని ఈసందర్భంగా భట్టి గుర్తు చేశారు.
రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలపై గత ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. ఈ రంగాలపై ఆసక్తి చూపెట్టే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు పూర్తి సహకారం అందించడానికి సంసిద్ధతగా ఉన్నదని వెల్లడించారు. రాష్ట్రంలోని మహిళలను రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి గా చూస్తున్నదన్నారు.మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు.
అనంతరం సిఐఐ విభాగం రూపొందించిన ఐదు శ్వేత పత్రాలను డిప్యూటీ సీఎం విడుదల చేశారు. కార్యక్రమంలో సిఐఐ తెలంగాణ చైర్మన్ శేఖర్ రెడ్డి, ప్రత్యేక అతిధిగా సీఐఐ దక్షిణ ప్రాంత చైర్మన్ కమల్ బాలి, సీఐ ఐ తెలంగాణ వైస్ చైర్మన్ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతిని కాపాడేందుకు లక్షకు పైగా మొక్కలు నాటిన ప్రగతి గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ జి వి కె రావు తో పాటు మరో నలుగురికి జ్ఞాపికలు అందించిన డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా అభినందించారు.