Thursday, May 29, 2025

Telangana Tenth results నేడు తెలంగాణ టెన్త్ ‌ఫలితాలు విడుదల

ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ

తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సారి కొత్తగా మార్కులతో పాటు- సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ‌ప్రకటించనున్నారు. ఆ విధంగానే మార్కస్ ‌మెమోలు జారీ కానున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4‌వ తేదీ వరకు జరిగిన పది పరీక్షలకు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విడుదలయిన పదో తరగతి ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఇక నుంచి పదో తరగతి మెమోల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు.

జీపీఏ అనేది తీసివేయనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్‌ ‌పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్‌ అయ్యారా? అనేది వివరంగా ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమంలో స్టూడెంట్స్‌కు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్‌ అం‌డ్‌ ‌లైఫ్‌ ఎడ్యుకేషన్‌, ‌వర్క్ అం‌డ్‌ ‌కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌, ఆర్ట్ అం‌డ్‌ ‌కల్చరల్‌ ఎడ్యుకేషన్‌, ‌ఫిజికల్‌ అం‌డ్‌ ‌హెల్త్ ఎడ్యుకేషన్‌ అనే నాలుగు కో కరిక్యులర్‌ ‌యాక్టివిటీ-స్‌కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు.

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి ఒక కీలుబొమ్మ: జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com