Saturday, January 18, 2025

థియోటర్లకు ‘తెర’

రాష్ట్రంలో సినిమా థియోటర్లకు తాళాలు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఓవైపు ఐపీఎల్​ సాగుతుండటం, వచ్చేనెల 2 నుంచి మినీ వరల్డ్​కప్​ మొదలుకానుండటంతో సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు కరువయ్యారు. దీంతో చాలా సినిమా థియోటర్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులకు తెలంగాణ థియోటర్స్​ అసోసియేషన్​ ఊహించని షాక్​ ఇచ్చింది. రాష్ట్రంలో పది రోజుల పాటు థియోటర్లను మూసేస్తున్నట్లు అత్యవసర ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో అక్యుపెన్సీ తక్కువ ఉండటం, నిర్వహణ ఖర్చులు పెరుగడంతో సింగిల్​ స్క్రీన్​ థియోటర్ల యాజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి. శుక్రవారం నుంచి వచ్చే పది రోజులు సింగిల్​ స్క్రీన్​ థియోటర్లలో ఎలాంటి షోలు వేయవద్దని థియోటర్స్​ అసోషియేషన్​ నిర్ణయం తీసుకున్నది. ఎన్నికలతో పాటుగా ఐపీఎల్​ ప్రభావంతో పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. చిన్న చిన్న సినిమాలు వచ్చినా.. వాటిని ప్రేక్షకులు ఆదరించడం లేదు. దీంతో సినిమా హాళ్లలో నిజంగానే ఈగలు కొట్టుకునే పరిస్థితులు దాపురించాయి. కొంత పెద్ద నగరాలతో పోలిస్తే.. ఇది చిన్న పట్టణాలు, మండలాల్లో మరింత ప్రభావం చూపించాయి. ఫలితంగా పది రోజులు థియోటర్లకు తాళాలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో సింగిల్​ స్క్రీన్​ థియోటర్లలో సినిమాలు ఆడవు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com