Saturday, July 6, 2024

తెలంగాణపై అల్పపీడనం..16జిల్లాలకు ఎల్లో అలర్ట్ !

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశాగంగా పరివాహక పశ్చిమ బెంగాల్ తీరం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6కి.మి ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తెలంగాణలో మరో నాలుగురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం నుంచి బుధవారం వరకు బలమైన, స్థిరమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ,నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular