Thursday, February 13, 2025

తెలంగాణలో ఆటోలు బంద్

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం ఆటోడ్రైవర్లు ఆందోళనలకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆటో డ్రైవర్ల జేఏసీ స్టేట్‌ కన్వీనర్‌ వెంకటేశం కోరారు. ఈ నెల 24న అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై తమ ఆందోళనకు మద్దతునివ్వాలని కోరుతామన్నారు. గతంలో తాము సమ్మెకు పిలుపునిస్తే ఇంటికి పిలిచి చర్చలు జరిపిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ నాలుగు నెలలు గడుస్తున్నా హామీల అమలును పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చినా ఆ పథకం అమలు చేయలేదని, మహాలక్ష్మీ పథకంతో తామంతా రోడ్డున పడ్డామని ఆటో డ్రైవర్ల అసోసియేషన్‌ ఆరోపించింది. త్వరలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారని.. ఈ నేపథ్యంలో ఆటో కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, రూ.10 కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. ఆటో డ్రైవర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని, లేదంటే ప్రభుత్వానికి తమ నిరసన సెగ తప్పదని ఆటో డ్రైవర్ల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిపించింది.దీంతో ఆటోలకు గిరాకీ లేకుండా పోయింది.అప్పటి నుంచి ఆటో సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. గతంలోనూ ఇందిరాపార్క్ వద్ద ఆటో డ్రైవర్లు మహాధర్నా కార్యక్రమం కొనసాగింది. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ తీసుకొచ్చిన ఫ్రీ బస్సు కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. మహా లక్ష్మి స్కీమ్ కు ముందు యావరేజ్ గా 1000 రూపాయలు సంపాదన ఉంటే.. ఇప్పుడు 500 కూడా సరిగ్గా రావడం లేదు అని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది.. అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. యాప్ లతో అనుమతి లేకుండా నడుస్తున్న టూ విలర్లను నిషేధించాలని కోరారు. ప్రమాద బీమాను రూ. 10 లక్షలకు పెంచి.. సాధారణ మరణాలకు వర్తింప చేయాలని ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్ జేఏసీ డిమాండ్ చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com