Friday, February 21, 2025

తెలంగాణలో అధిక సంఖ్యలో వాహనాలు

తెలంగాణలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్ 2 నాటికి తెలంగాణలో 71.52 లక్షల వాహనాలు ఉండగా, పదేండ్లలో రెండున్నర రెట్లకు పెరిగింది. ఈ పదేళ్లలో కొత్తగా కోటి వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే పదేండ్లలో ఏటా సగటున పది లక్షల చొప్పున కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1.72 కోట్లకు చేరింది.
వాహనాల కొనుగోలుకు బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు విరివిగా రుణాలు ఇస్తున్నాయి. దీంతో చిరుద్యోగులు ఉద్యోగం రాగానే వెంటనే నెలసరి వాయిదాలపై వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి వర్గాలు కూడా ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత జనాభాలో సగటున ఇద్దరిలో ఒకరికి వాహనం ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 82.45 లక్షల వాహనాలు ఉన్నాయి. అంటే దాదాపు 50 శాతం వాహనాలు ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com