Sunday, May 11, 2025

Big Breaking: ఏపీలో తిరుగులేని ఆధిక్యం దిశగా టీడీపీ.. 108 స్థానాల్లో దూకుడు

చూస్తుంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్‌లో అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. కడపటి వార్తలు అందేసరికి టీడీపీ 94 స్థానాల్లో, బీజేపీ 5, జనసేన 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.

కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేశ్, గురజాలలో యరపతినేని, గుడివాడలో వెనిగండ్ల రాము, రాజమండ్రి రూరల్‌లో బుచ్చయ్య చౌదరి, జగ్గయ్యపేటలో జ్యోతుల నెహ్రూ, పొన్నూరులో ధూళిపాల, రేపల్లెలో అనగాని, నంద్యాలలో ఫారూఖ్, పెనుగొండలో సబితమ్మ, దెందులూరులో చింతమనేని, రాజమండ్రి టౌన్‌లో ఆదిరెడ్డి వాసు, హిందూపురంలో బాలకృష్ణ, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి, కొవ్వూరులో ముప్పుడి వెంకటేశ్వరరావు, సత్తెనపల్లిలో కన్నా, రాప్తాడులో పరిటాల సునీత తదితరులు లీడ్‌లో ఉన్నారు.

అలాగే, పిఠాపురంలో పవన్ కల్యాణ్, తెనాలిలో నాదెండ్ల మనోహర్, కాకినాడ రూరల్‌లో నానాజీ, జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తదితరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com